Hyderabad: ప్రజాభవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు బీభత్సం..
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ పంజాగుట్టలోని ప్రజాభవన్ ఎదుటు తన కారుతో భయభ్రంతులకు గురి చేశాడు. తన బీఎండబ్ల్యూ కారుతో బారీకేడ్లను ఢీ కొట్టాడు. ఈ ఘటన డిసెంబర్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సీపీ శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.
కారులో ఉన్న షకీల్ కుమారుడు.. ఓవర్ స్పీడ్ తో కారును ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను కుద్దాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువకులతోపాటు ముగ్గురు యువతులు ఉన్నట్లు సీపీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అని తెలిసినప్పటికీ స్థానికంగా ఉన్న పోలీసులు మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

పోలీసులు.. అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదు చేశారు. కారు బీభత్సం ఘటన బయటకు రావడంతో.. పూర్తి విచారణ చేపట్టాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీసులకు స్పష్టం చేశారు. సీపీ ఆదేశాలతో ఘటనపై విచారణ పోలీసులు విచారణ ప్రారంభించారు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ అని ప్రాధమికంగా గుర్తించామని చెబుతున్నారు.
అబ్దుల్ ఆసిఫ్ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని... అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. సోహెల్ గతంలోనూ ప్రమాదాలు చేసినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో జూబ్లీహిల్స్ లో కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణమైన కారులు షకిల్ కుమారుడు సోహెల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications