యాచకురాలి ఇంట్లో నాలుగు సంచుల డబ్బు.. ఎంత దొరికిందో తెలుసా?
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని ఓ ఇంటిలో డబ్బు సంచులు బయటపడ్డ ఘటన చర్చానీయాంశంగా మారింది. జీడిమెట్ల పరిధిలోని దుండిగల్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఓ ఇంటిలో 2 లక్షల 31వేల రూపాయలున్న నగదు మూటలు దొరికాయి. నాలుగు బస్తాల్లో 10, 100 రూపాయల నోట్లు లభ్యమయ్యాయి.
జలమండలిలో ఉద్యోగిగా పనిచేసే విజయలక్ష్మి అలియాస్ దేవి 2016 సంవత్సరంలో కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆఫీస్ కు వెళ్లి విచారించగా ఆమెను విధుల్లో నుంచి తప్పించినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె కూతురు సంతోషి దుండిగల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే 2017 నుంచి విజయలక్ష్మి యాచకురాలిగా జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దుండిగల్ రాజీవ్ గృహకల్ప నివాస సముదాయంలోని ఓ ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నారు. ఆరు ఏడు నెలలు అద్దె చెల్లించిన విజయలక్ష్మి కొద్ది రోజులుగా కిరాయి ఇవ్వడం లేదని తెలుస్తోంది.

మరోవైపు ఆమె కనిపించకుండా పోయినట్లు సమాచారం. దీంతో ఇంటి యజమాని విజయలక్ష్మి అద్దెకు ఉంటున్న పోర్షన్ తాళాలు పగులగొట్టారు. నాలుగు బస్తాల్లో నగదు బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. తీరా ఆ మూటలు తెరిచి చూసేసరికి అందులో 2 లక్షల 31వేల రూపాయల నగదు కనిపించింది. డి.పోచంపల్లిలో నివాసముంటున్న విజయలక్ష్మి కూతురును పిలిపించి ఈ నగదు ఆమెకు అందించారు. ఓ ఇంట్లో డబ్బులున్న సంచి దొరికిందనే వార్త వైరల్ గా మారింది. అదలావుంటే కనిపించకుండా పోయిన విజయలక్ష్మి ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించకపోవడం గమనార్హం. మిస్సింగా లేదంటే ఇంకేమైనా జరిగి ఉండొచ్చా అనే విషయాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications