హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ముఠా గుట్టురట్టైంది. నాచారంలో నివాసముండే స్టాన్లీ డేవిడ్ (63సం.), దుర్గం చెరువు సరోజిని (56సం.), మరపాటి సుమన్ (33సం.) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగులకు గాలం వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దండుకున్నారు. 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లపాటు వీరి అక్రమ భాగోతం యదేచ్ఛగా సాగింది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల నుంచి 8 లక్షల 50 వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారు.

fraud in the name of government jobs accused persons remanded

 కాంగ్రెస్‌కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరుమర్తి..! కాంగ్రెస్‌కు హ్యాండ్?.. కోమటిరెడ్డికి షాక్?.. సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరుమర్తి..!

చేసిన పాపం ఊరికే పోదు కదా. పాపం పండే టైమొచ్చింది. చివరకు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన శివకుమార్ అనే యువకుడు ఈ ముఠా చేసిన మోసంపై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి 7 లక్షల రూపాయల నగదు, హోండా సిటీ కారు, 16 మందికి చెందిన విద్యార్హతల సర్టిఫికెట్లను, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

English summary
Some cheating people make money from the unemployed. A gang that drowned the unemployed to provide the government jobs and collected in lakhs. At last the gang were arrested with someone complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X