హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా తెలంగాణ నుంచి సూపర్ తెలంగాణ వరకు..! గణనీయంగా తగ్గిన కేసులు..!నేడు ఆరు మాత్రమే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఒక్క అడుగు.. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కరోనా వైరస్ పై చేస్తున్న యుద్దంలో విజయ దుందుభి మోగించేంకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు తెలంగాణలో కేవలం 6 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం పట్ల అంతా ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

 విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!! విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!

వరుసగా రెండో రోజు కూడా జిల్లాల నుంచి ఒక్క కేసు నమోదు కాలేదు. కేవలం ఆరుగురు మాత్రమే ఆసుపత్రిలో చేరగా మంగళవారం 42 మంది డిశ్చార్జి అవ్వడం శుభ పరిణామంగా చర్చ జరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1009 కి చేరింది. మూడు రోజులుగా కరోనా మరణాలు కొత్తగా నమోదు కాకపోవడం తెలంగాణ రాష్ట్రానికి మరో శభసూచకంగా మారింది.

From Corona Telangana to Super Telangana.!Only six cases reported today..!!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 610 యాక్టివ్ కేసులుండగా, మొత్తం 374 మంది దిశ్చార్జీ అయ్యారు. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు నిర్ధారణ అవుతోంది.

Recommended Video

Fake News Buster : 18 కేంద్ర ప్రభత్వ ఉద్యోగులారా.. కంగారు పడొద్దు !

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల వంటి పది జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. బుదవారం మరో 11 జిల్లాల్లో ఉన్న పేషెంట్లు డిశ్చార్జి అవ్వనున్నారు. అంటే బుదవారం సాయంత్రానికి తెలంగాణలో 21 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారిపోనున్నాయి. కేసులు నమోదైంది కేవలం హైదరాబాదు, వికారాబాద్, సూర్యాపేట, గద్వాల్ జిల్లాలు మాత్రమేనని తెలుస్తోంది.

English summary
Chief Minister Chandrasekhar Rao seems to have expressed concern over the decline of corona cases. There are currently 610 active cases in Telangana, with a total of 374 discharged. According to a health bulletin released by the Department of Health today, the number of coronavirus cases in Telangana has been significantly reduced. There are only 6 new cases being reported in Telangana today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X