నిమజ్జన మహోత్సవం : బాలపూర్ లడ్డు వేలం- సాగర్ తీరానికి మధ్నాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడు..!!

భాగ్యనగరిలో గణేషుడి నిమజ్జన శోభతో మెరిసిపోతోంది. కరోనా కారణంగా గత ఏడాది దూరంగా ఉన్న నగర జనం ఇప్పుడు వేలాదిగా నిమజ్జన ఉత్సవం తరలించటానికి తరలి వస్తున్నారు. వేలాదిగా విగ్రహాలు మరి కాసేపట్లో సాగర తీరానికి తరలి రానున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా 'గణ' ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి.

అప్పటి నుంచి ఇప్పటి వరకు బొజ్జగణపయ్యకు భక్తజనం ఘనంగా వేడుకలు నిర్వహిస్తూనే ఉన్నారు. వినాయకుని నిమజ్జనం నాడు ప్రతీ ఏటా బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. బాలాపూర్‌ గణేశుని లడ్డూ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఎంత మొత్తంలో వేలంలో ధర పలుకుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. అదే విధంగా.. ప్రతీ ఏటా ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ అట్రాక్షన్. ఈ సారి పోలీసుల సూచన మేరకు ..ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి సాగరాన్ని చేరనున్నాడు. పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్రకు సంబంధించిన పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే క్రేన్‌ సాయంతో ట్రాలీపై కొలువుతీరాడు. ప్రస్తుతం ట్రాలీపై వెల్డింగ్‌ పనులు సాగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే గణేశుడి శోభాయత్ర ప్రారంభం కానుంది. ఇక, గ్రేటర్ పరిధిలో మొత్తం హుస్సేన్‌సాగర్‌కు శోభాయాత్ర మార్గాలు: 320 కి.మీ. గా గుర్తించారు.

Ganesh Idols immersion in Hyderbad begin with high security and following covid protocol

నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అందు కోసం 33 చెరువులు, 25 కొలనులు నిమజ్జనం జరిగే ప్రాంతాలు గా గుర్తించారు. 316 క్రేన్లను విగ్రహాల నిమజ్జనానికి అందుబాటులో ఉంచారు. 40 క్రేన్లను ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సిద్దం చేసారు. అదనంగా విద్యుత్ సరఫరా కోసం 48 ట్రాన్స్‌ఫార్మర్లు హుస్సేన్‌సాగర్‌ వద్ద ఏర్పాటు చేసారు. 19 వేల మంది నిమజ్జనం విధుల్లో ఉండేలా పోలీసు అధికారులు లెక్కలు చెబుతున్నారు.

నిమజ్జనం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహ మూద్‌అలీలతోపాటు డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌లు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర, నిమజ్జనాలను హెలికాప్టర్‌లో ఏరియల్‌వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవాకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసారు. ప్రత్యేక కంట్రోల్ రూం ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుుడు పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+