Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లోని ఆ ఆస్పత్రిలో ఒక్క రూపాయికే వైద్యం; షుగర్ టెస్టులు కూడా ఉచితం!!

వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దైవంతో సమానం అని అర్థం. కానీ నేటి రోజుల్లో వైద్యం పేరుతో విపరీతమైన వ్యాపారం కొనసాగుతుంది .ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైనా అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్లాలంటే వేల రూపాయల డబ్బులు చేతిలో పట్టుకోవాల్సిందే. తీవ్ర అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడుతున్నా కూడా ఆసుపత్రులలో ఫీజుల వసూళ్ల నేపథ్యంలో చాలా మంది ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కేవలం వైద్యుడు చూడడానికి తీసుకునే ఓపి ఫీజు కూడా 500 నుండి 1000 రూపాయల వరకు ఉంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్ లో రూపాయి ఫీజుతో వైద్య సేవలు ..

మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్ లో రూపాయి ఫీజుతో వైద్య సేవలు ..


ఇక ప్రైవేటు ఆసుపత్రులు వైద్య చికిత్స పేరుతో రోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ వైద్య సేవలు అందిస్తూ ఉంటే, ఓ చారిటబుల్ ట్రస్ట్ మాత్రం పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందించడానికి ముందుకు వచ్చింది. మెట్రోపాలిటన్ నగరమైన హైదరాబాద్లో పేదలకు ఒక్క రూపాయి తో వైద్య సేవలను అందించడానికి ఏర్పాటైంది రామ్ నగర్ లోని జిజి హాస్పిటల్. ఇక వైద్య పరీక్షలకు కూడా నామమాత్రపు ఫీజు తీసుకుంటూ జీజీ చారిటీ హాస్పిటల్స్ సేవలందిస్తుంది.

రామ్ నగర్ లో ఏర్పాటైన ఆస్పత్రి .. నిరుపేదలకు కల్పవల్లి

రామ్ నగర్ లో ఏర్పాటైన ఆస్పత్రి .. నిరుపేదలకు కల్పవల్లి


రామ్ నగర్ ప్రధాన రహదారిపై 50 పడకల సదుపాయంతో నిర్మించిన జి జి చారిటీ ఆసుపత్రి నిరుపేదలకు ఒక రూపాయితో వైద్య సేవలను అందిస్తుంది. ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రతినిత్యం 300 నుండి 400 మంది రోగులకు ఓపి సేవలను అందిస్తుంది. బయట కార్పొరేట్ ఆసుపత్రులతో పోలిస్తే నామమాత్రపు ధరకే నిర్ధారణ పరీక్షలను కూడా చేస్తూ, కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూ పేదలకు భరోసా కల్పిస్తుంది. ఇక ఓపెన్ ఫీజు కేవలం ఒక్క రూపాయి గా నిర్ణయించి సేవలు అందించడంతో ఇది నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒక్క రూపాయితోనే వైద్య సేవలు .. అందుబాటులో ఉన్న వైద్య విభాగాలివే

ఒక్క రూపాయితోనే వైద్య సేవలు .. అందుబాటులో ఉన్న వైద్య విభాగాలివే

సాధారణ జ్వరం వంటి చిన్న రోగాలకు కూడా డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలంటే మినిమం ఐదు వందల రూపాయల దాకా ఓపి ఫీజు కట్టాలి. కానీ అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక్క రూపాయి తోనే ఓపి సేవలను అందిస్తుంది జి జి చారిటబుల్ ఆసుపత్రి. డీఎస్ఆర్ అండ్ డీవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ సర్జన్, శ్వాస సంబంధిత సమస్యలకు సంబంధించిన ఓపీ సేవలు కేవలం ఒక్క రూపాయికే లభిస్తున్నాయి.

బీపీ, మధుమేహానికి ఉచిత టెస్టులు, మిగతా పరీక్షలకు రాయితీ

బీపీ, మధుమేహానికి ఉచిత టెస్టులు, మిగతా పరీక్షలకు రాయితీ

ఇక ఈ ఆసుపత్రిలో బిపి, మధుమేహానికి సంబంధించిన టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, రక్త పరీక్షలతో పాటు వివిధ రకాల నిర్ధారణ పరీక్షలను 50 శాతం రాయితీతో అందిస్తున్నారు. అంతేకాదు ఈ ఆసుపత్రికి వచ్చే వైద్యులు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం కోసం ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ పథకాలు వర్తించే వెసులుబాటు కూడా ఉందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రూపాయికే 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా చెబుతున్నారు.

ఆస్పత్రికి వచ్చిన రోగులతో పాటు సహాయకులకు ఉచిత భోజనం

ఆస్పత్రికి వచ్చిన రోగులతో పాటు సహాయకులకు ఉచిత భోజనం


ఇక ఆసుపత్రికి వచ్చిన రోగులతో పాటు వచ్చే సహాయకులకు కూడా తాము ఉచిత భోజనం, ఉదయం అల్పాహారం పెడుతున్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆసుపత్రికి వెళ్లాలి అంటే ప్రజలు భయపడుతున్న నేటి రోజుల్లో పేదలకు కేవలం ఒక్క రూపాయితో సేవలు అందిస్తున్న ఈ ఆస్పత్రి నిజంగా ప్రశంసనీయం. ఇలాంటి ఆస్పత్రులనే పేదల ఆరోగ్య ప్రదాయినిగా చెప్పొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+