హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Election Results 2020: ఓయూ డీఆర్సీ వద్ద ఉద్యోగుల ఆందోళన, ఎందుకంటే.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

గ్రేటర్ ఓట్ల లెక్కింపులో అధికారులు.. ఉద్యోగులను ఇబ్బందికి గురిచేశారు. కౌంటింగ్ కోసం రావాలని ఆర్డర్ కాపీ పంపించారు. తీరా వస్తే డ్యూటీ లేదు అని చెప్పడంతో విస్తుపోవడం వారి వంతయిపోయింది. ఓయూ డీఆర్సీ వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు అటెండెన్స్‌తోపాటు రెమ్యునరేషన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు .. ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం .... అడ్రెస్ లేని టీడీపీఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు .. ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం .... అడ్రెస్ లేని టీడీపీ

వివిధ జిల్లాల నుంచి వచ్చామని ఉద్యోగులు తెలిపారు. తీరా సమయానికి డ్యూటీ లేదని చెప్పడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ రోజు కూడా డ్యూటీ చేశామని వివరించారు. అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్నామని తెలిపారు. ఆ మరునాడు ట్రైనింగ్ కోసం రావాలని చెప్పడంతో హాజరయ్యామని తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటలకు రావాలని కోరడంతో ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చామని చెప్పారు. కానీ తాము వచ్చేసరికి అప్పటికే మిగతా వారితో భర్తీ చేశామని వివరించారు. తమ పరిస్థితి ఏంటీ అని ఉద్యోగులు అడిగారు.

GHMC Election Results 2020: employees agitation at ou drc

తాము చిన్నపిల్లలను వదిలి కౌంటింగ్ కేంద్రానికి వచ్చామని వివరించారు. తమకు డ్యూటీ ఇవ్వాలని.. కనీసం అటెండెన్స్ కూడా తీసుకోలేదని చెప్పారు. రెమ్యూనరేషన్ కంపల్సరీ కావాలని చెప్పారు. ఎక్కడో పటాన్ చెరు నుంచి క్యాబ్‌లో వస్తే రూ.600 అయ్యాయని.. తమకు రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగుల నిరసనతో ఆ ప్రాంతం మిన్నంటింది. అక్కడికి పోలీసులు/ అధికారులు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

Recommended Video

GHMC Election Results 2020 : ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటాం! - MLC Kalvakuntla Kavitha

English summary
Hyderabad GHMC Election Results 2020: employees agitation at ou drc centre for duty and remuneration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X