డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా 149 డివిజన్లకు పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగగా ఓల్డ్ మలక్‌పేట్‌కు మాత్రం డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ జరిగింది. ఈ సారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. దీంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. బీజేపీ సైలెంట్ వేవ్‌ను నమ్ముకోగా అధికారిక టీఆర్ఎస్ మాత్రం విజయం తమదే అన్న ధీమాతో ఉంది.
ఇక ఓల్డ్ మలక్‌పేట్‌లో రీపోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హోరెత్తించాయి. అన్ని సర్వేలు గులాబీ పార్టీకే అనుకూలంగా తమ ఫలితాలను వెలువరించాయి. ఇక టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పాయి. మేయర్ పీఠంను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ...ఓటర్ తీర్పు మాత్రం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇక గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల కౌంటింగ్‌పై మినిట్-టూ- మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం
Newest FirstOldest First
9:48 PM, 4 Dec
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
టీఆర్ఎస్:56,బీజేపీ: 48, ఏఐఎంఐఎం:44, కాంగ్రెస్:2
9:03 PM, 4 Dec
గ్రేటర్లో టీడీపీకి సున్నా సీట్లు..106 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ
8:53 PM, 4 Dec
గ్రేటర్ ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మలేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
8:47 PM, 4 Dec
తెలంగాణలో టీఆర్ఎస్కు కాలం చెల్లినట్లే: డీకే అరుణ
8:29 PM, 4 Dec
గ్రేటర్లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీ
8:28 PM, 4 Dec
మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని భావించాం అవి రాలేదు: కేటీఆర్
8:27 PM, 4 Dec
ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..టీఆర్ఎస్ పార్టీని అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను: మంత్రి కేటీఆర్
8:26 PM, 4 Dec
పది పన్నెండు సీట్లలో చాలా తక్కువ మెజార్టీతో ఓటమిపాలవడం జరిగింది. ఇందులో నిరాశపడాల్సిన పనిలేదు:కేటీఆర్
8:25 PM, 4 Dec
ఫలితం మేం ఆశించిన విధంగా రాలేదు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి: మంత్రి కేటీఆర్
8:25 PM, 4 Dec
జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నా: కేటీఆర్
8:16 PM, 4 Dec
బీజేపీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రజలు ఓటు వేశారు.. మేము అడ్డదారిలో మేయర్ పదవి కావాలని కోరుకోవడం లేదు: బండి సంజయ్
బీజేపీ రాష్ట్రకార్యాలయం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీ నేతల సంబరాలు
7:30 PM, 4 Dec
బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కేకే కుమార్తె విజయలక్ష్మీ విజయం
7:28 PM, 4 Dec
వివేకానంద నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా విజయం
7:10 PM, 4 Dec
గ్రేటర్ తీర్పు ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం: బండి సంజయ్
7:09 PM, 4 Dec
టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
6:52 PM, 4 Dec
దుబ్బాకలో అల్లుడి సంగతి చూసిన ప్రజలు..జీహెచ్ఎంసీలో కొడుకు పని పట్టారు: బండి సంజయ్
6:50 PM, 4 Dec
బీజేపీ విజయం భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే దక్కింది: బండిసంజయ్
6:50 PM, 4 Dec
రాష్ట్రంలో పెనురాజకీయ మార్పులు ఖాయం: లక్ష్మణ్
6:49 PM, 4 Dec
ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాం: బండి సంజయ్
6:48 PM, 4 Dec
గ్రేటర్లో విజయం కార్యకర్తల కృషి: బండి సంజయ్
6:48 PM, 4 Dec
టీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయి.. ఇవే టీఆర్ఎస్కు చివరి ఎన్నికలు: లక్ష్మణ్
6:47 PM, 4 Dec
కాసేపట్లో రాజీనామాపై ఉత్తమ్ ప్రకటన చేసే అవకాశం
6:46 PM, 4 Dec
గ్రేటర్లో రెండు డివిజన్లకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్
6:46 PM, 4 Dec
గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
6:46 PM, 4 Dec
టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ గుడ్ బై..?
6:35 PM, 4 Dec
ముషీరాబాదులో బీజేపీ అభ్యర్థి సుప్రియ విజయం
6:32 PM, 4 Dec
66 స్థానాలు కూడా టీఆర్ఎస్ దక్కించుకోకపోతే మజ్లిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది
6:29 PM, 4 Dec
బల్దియా బాద్షా ఎవరు..? మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో టీఆర్ఎస్. కీలకం కానున్న ఎక్స్ అఫిషియో ఓట్లు
6:20 PM, 4 Dec
బేగంబజార్‌లో బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ విజయం
READ MORE
10:26 PM, 3 Dec
డిసెంబర్ 4వ తేదీన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు
10:26 PM, 3 Dec
డిసెంబర్ 1న 150 డివిజన్లకు జరిగిన పోలింగ్
10:36 PM, 3 Dec
జిహెచ్ఎంసి సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్స్
6:18 AM, 4 Dec
తెలంగాణ
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కేంద్రాలను నెలకొల్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 లెక్కింపు హాల్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో హల్కు 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు.
6:33 AM, 4 Dec
తెలంగాణ
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 8152 సిబ్బందిని నియమించారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులుగా ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియను సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక రౌండ్‌కు 14,000 వేల ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది.
6:44 AM, 4 Dec
తెలంగాణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 74 లక్షల 67 వేల 256. ఇందులో 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 18,60,40 మంది పురుషులు, 15,90,219 మంది మహిళలు ఉన్నారు.
6:57 AM, 4 Dec
తెలంగాణ
ఎన్నికల నిబంధనల ప్రకారం.. తొలుత పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభమౌతుంది. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైంది. లెక్కింపు కేంద్రాల్లో సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
7:20 AM, 4 Dec
తెలంగాణ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోరు కొనసాగింది. మేయర్ పీఠం కోసం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మరోసారి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగిరే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
7:31 AM, 4 Dec
తెలంగాణ
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం జారీ చేసిన సర్కులర్ వివాదాన్ని రేపుతోంది. పెన్నుతో మార్క్ చేసినా, గీత గీసి ఉన్నా ఓటు వేసినట్లేనని ఈ సర్క్యులర్ పేర్కొంటోంది.బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటం చేస్తోంది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
7:42 AM, 4 Dec
తెలంగాణ
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట మెహదీపట్నం డివిజన్ ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు. చివరిగా మైలార్దేవ్ పల్లి ఫలితం వెలువడుతుంది.
8:09 AM, 4 Dec
తెలంగాణ
We are expecting to win over 100 seats. Although many big leaders from BJP came to campaign and made many false claims, I'm happy that people of Hyderabad did not believe in them & reposed their faith in KCR's leadership: Telangana Rashtra Samithi leader K Kavitha #GHMCElectionspic.twitter.com/TYKTjrJ0Mc
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లను గెలుస్తామంటూ టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ధీమా. బీజేపీకి చెందిన సీనియర్ నేతలు చేసిన ప్రచారాన్ని హైదరాబాదీయులు విశ్వసించలేదని, కేసీఆర్ నాయకత్వం వైపే మొగ్గు చూపారని వెల్లడి
8:12 AM, 4 Dec
Telangana: Counting for Greater Hyderabad Municipal Corporation (GHMC) elections to begin shortly; visuals from LB Stadium counting centre. pic.twitter.com/RWRMUMniGn
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌ను చేపట్టారు. అన్ని కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పహారా కాస్తోన్న పోలీసులు
8:25 AM, 4 Dec
తెలంగాణ
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 50 వేల మంది తో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. విజయోత్సవ ర్యాలీలు, ప్రదర్శనలను నిర్వహించడాన్ని నిషేధించారు.
8:30 AM, 4 Dec
తెలంగాణ
హయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ-3, టిఆర్ఎస్-1, టీడీపీ-1 దక్కాయి.
8:45 AM, 4 Dec
తెలంగాణ
బోయిన్ పల్లి డివిజన్ పోస్టల్ బ్యాలెట్లలో పోటాపోటీ. టిఆర్ఎస్-8, బీజేపీ-7. మరో రెండింటిని చెల్లనివిగా గుర్తించారు కౌంటింగ్ అధికారులు. కూకట్ పల్లి డివిజన్లో టీఆర్ఎస్-21, బీజేపీ-24 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. టీడీపీ, నోటాకు రెండు చొప్పున ఓట్లు పడ్డాయి.
8:48 AM, 4 Dec
తెలంగాణ
శేరిలింగంపల్లి డివిజన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీకి ఆధిక్యత లభించింది. బీజేపీ-5, టీఆర్ఎస్-3 ఓట్లు పోల్ అయ్యాయి. గాజులరామారం డివిజన్లో బీజేపీ-3, టీఆర్ఎస్-2, కాంగ్రెస్-1 ఓట్లు పోల్ అయ్యాయి.
8:53 AM, 4 Dec
తెలంగాణ
Telangana: Counting for Greater Hyderabad Municipal Corporation (GHMC) elections underway; visuals from LB Stadium counting centre. #GHMCPollspic.twitter.com/RP486Dw7xy
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా సాగుతోంది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తోన్న సిబ్బంది.
8:58 AM, 4 Dec
తెలంగాణ
ఉస్మానియా యూనివర్శిటీలోని ప్రొఫెసర్ జీ రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డీఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలో విధి నిర్వహణ కోసం వచ్చిన ఉద్యోగులకు వెనక్కి వెళ్లి పోవాలని ఆదేశించడంతో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
9:08 AM, 4 Dec
హైదరాబాదులోని పలు డివిజన్లలో బీజేపీ ముందంజ
9:09 AM, 4 Dec
ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఓట్లు లెక్కింపునకు మరో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది
9:12 AM, 4 Dec
పోస్టల్ బ్యాలెట్లలో రెండో స్థానంలో కొనసాగుతోన్న టీఆర్ఎస్, తొలిస్థానంలో బీజేపీ
9:13 AM, 4 Dec
హయత్ నగర్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఘర్షణ, టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
9:49 AM, 4 Dec
అర్థరాత్రి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్టు. ఈసీ ఉత్తర్వులపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ. స్వస్తిక్ గుర్తు ఉంటేనే పరిగణించాలని తీర్పు చెప్పిన హైకోర్టు
10:02 AM, 4 Dec
మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 1926, మెజార్టీ డివిజన్లలో బీజేపీకి దక్కిన పోస్టల్ బ్యాలెట్లు
10:05 AM, 4 Dec
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా డివిజన్ల లో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైంది. డివిజన్ల వారిగా పోలైన ఓట్ల ఫలితాలిలా ఉన్నాయి.