Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుక్కల దాడిలో బాలుడి మృతి: జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఏమన్నారంటే.?

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్: నగరంలో కుక్కల దాడిలో బాలుడు చనిపోవడం బాధాకరమని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అంబర్‌పేట వీధిలో కుక్కల దాడిలో ప్రదీప్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి డెటర్నరీ, జీహెచ్ఎంసీ జోనల్ విభాగాల అధికారులు హాజరయ్యారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలు: మేయర్

హైదరాబాద్ పరిధిలో 5.75 లక్షల వీధి కుక్కలున్నాయని మేయర్ తెలిపారు.ఇందులో 4 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గ్రేటర్ లో 30 సర్కిల్స్‌లో కుక్కలను పట్టుకోవడం కోసం 30 టీమ్ లు పని చేస్తున్నాయని తెలిపారు. కుక్కలకు స్టేరిలైజేషన్ చేస్తున్నామని, అయితే.. కొన్ని కుక్కులు స్టేరిలైజేషన్ చేసినా కరుస్తాయన్నారు. కుక్కల కట్టడిలో భాగంగా ప్రతి వార్డులో 20 కుక్కలను దత్తత తీసుకోవడంపై దృష్టి పెట్టనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు.

ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయన్న మేయర్ విజయలక్ష్మి

వీధి కుక్కలకు ఆహారం అందించడం ద్వారా వాటి ఆగడాలను నిరోధించనున్నట్లు పేర్కొన్నారు. కుక్కల దాడిలో బాలుడి మరణం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆకలితోనే కుక్కలు బాలుడిపై దాడి చేశాయని చెప్పారు. ఆ కుక్కలకు మాంసం వేస్తున్న ఓ మహిళ రెండు రోజులుగా అందుబాటులో లేకపోవడంతో కుక్కలు దాడులు చేశాయన్నారు.

అన్నింటికీ జీహెచ్ఎంసీని నిందించడం సరికాదన్న మేయర్

అన్నింటికీ జీహెచ్ఎంసీని నిందించడం సరికాదన్న మేయర్

వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.
కుక్కలకు సంబంధించిన విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తామన్నారు. కుక్కలపై చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని తెలిపారు. ప్రతిదానికి జీహెచ్ఎంసీని నిందించడం సరికాదని అన్నారు.

కుక్కల దాడిలో బాలుడి మరణం హృదయ విదారకం

కుక్కల దాడిలో బాలుడి మరణం హృదయ విదారకం

అంబర్‌పేట ఛే నెంబర్ చౌరస్తా వద్ద వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచి వేస్తోంది. బాగ్ అంబర్‌పేటలో ఉంటున్న గంగాధర్.. తన కొడుకు ప్రదీప్‌ను సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి గంగాధర్ వెళ్లిపోగా.. అప్పుడే నడుచుకుంటూ బయటకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ముట్టడించి దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ తర్వాత బాలున్ని రెండు కుక్కలు నోట కరచుకుని చెరోవైపు లాగడంతో తీవ్రగాయాలపాలై చనిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.కాగా, హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్ణకరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+