గ్రేటర్ వార్ ... రంగంలోకి దిగిన కవిత ... కాంగ్రెస్ , బీజేపీలకు ఆ హక్కు లేదంటూ ఫైర్
జిహెచ్ఎంసి ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మాటల తూటాలను పేలుస్తున్నారు. అధికార టీఆర్ఎస్ నుండి కెసిఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఆమె మాట్లాడారు . టిఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు కవిత . సోషల్ మీడియాలో పోస్టులతో , వీడియోలతో ఆదరగోడుతున్నారు.

ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ .. ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉందో అందరికీ తెలుసు
ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ ఎలా ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ ఎలా ఉంది అన్నది తెలంగాణ బిడ్డలందరికీ తెలుసంటూ వ్యాఖ్యానించారు కవిత . కెసిఆర్ నాయకత్వంలో కేటీఆర్ మార్గనిర్దేశంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్న కవిత, 65 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు. అభివృద్ధిని కొనసాగించాలంటే టీఆర్ఎస్ కు ఓటెయ్యాలని కవిత పిలుపునిచ్చారు . హైదరాబాద్ అన్ని రంగాల్లో గత ఆరేళ్లుగా ప్రగతి సాధించిందని అలాంటి ప్రగతి పైఅపై మాటలతో రాదని పేర్కొన్నారు .

కాంగ్రెస్ , బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు
కాంగ్రెస్ బిజెపిలకు జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు లేదంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు . నిరుపేదలైన వరదబాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలు పేద ప్రజల నోటికాడి ముద్దను లాక్కున్నాయి అని ఫైర్ అయిన కవిత జాతీయ పార్టీగా చెప్పుకునే పార్టీలు, నగర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.

కరోనా వచ్చినా , వరదలు వచ్చినా అండగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వమే
కరోనా వచ్చినా, వరదలు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉందని పేర్కొన్న కవిత, టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆదుకుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోయాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్ నుండే టిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొన్న కవిత గాంధీ నగర్ లో కనపడుతున్న అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అన్నారు . గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video

ప్రచారం మొదలెట్టిన కవిత .... సోషల్ మీడియాలో కూడా కవిత పోస్టులు
టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఎమ్మెల్సీ కవిత కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సంచలన పోస్ట్ లతో దుమ్ము రేపుతున్నారు. మరోపక్క గ్రేటర్ ఎన్నికల బాధ్యతను భుజాల మీద వేసుకుని మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కూడా ప్రచారం మొదలు పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు .
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications