గోవా నుండి హైదరాబాద్‌కు వస్తుండగా ఘోరప్రమాదం, మంటల్లో కాలిపోయిన బస్సు.. ఏడుగురు దుర్మరణం!!
కర్ణాటక రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఒక బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున కలబురిగి జిల్లా కమలాపురా పట్టణం శివార్లలో జరిగిన ప్రమాదంలో ప్రైవేట్ బస్సులోని ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమైనట్లు సమాచారం. దాదాపు 25 మండి గాయాలపాలయ్యారు.
అతివేగంతో అదుపుతప్పిన బస్సు ... డీజిల్ ట్యాంక్ లీకై మంటలు .. ఘోర ప్రమాదం
అతివేగంతో అదుపు తప్పిన బస్సు టెంపో వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు, ఆపై కల్వర్టును ఢీకొట్టి రోడ్డు దిగువకు దూసుకెళ్లింది. ఇది 50 మీటర్ల వంతెనపై నుండి పడిపోయింది. దీంతో వెంటనే డీజిల్ ట్యాంకు లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఇక బస్సులో దాదాపు ఏడుగురు మరణించారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏసీ బస్సు మరియు గూడ్స్ వాహనం మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా 25 మంది ఆసుపత్రి పాలయ్యారు.
గోవా నుండి హైదరాబాద్ కు బస్సు ... ప్రమాదంలో 25 మందికి గాయాలు
గోవా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో ప్రమాదానికి గురైంది.ఈ బస్సు ప్రమాదంలో నలుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరో ముగ్గురు, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులంతా తెలంగాణ వాసులేనని సమాచారం. గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలోనే ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 25 మందికి గాయాలయ్యాయని తీవ్రంగా గాయపడిన వారి కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Recommended Video

మృతులంతా తెలంగాణా వాసులే .. ఒకే కుటుంబానికి చెందిన వారేనని అనుమానం
ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మంది హైదరాబాద్ నుంచి ఇటీవల గోవాకు వెళ్లారని, వారంతా ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. ఇక గోవా నుండి తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలోనే బస్సు అదుపు తప్పి టెంపో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ తరువాత కల్వర్టును ఢీకొట్టి 50 మీటర్ల కిందకు పడిపోయింది. ఇక ప్రమాదం జరుగుతున్న సమయంలో కొంతమంది ముందే గుర్తించి డోర్లు, కిటికీలు నుంచి బయటకు దూకేశారు. వారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించలేకపోయిన కొందరు బస్సులోనే ఇరుక్కుపోయారు.
ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సులోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను కలబుర్గి గ్రామీణ ఎమ్మెల్యే బసవరాజు మతి మూడ్ పర్యవేక్షిస్తున్నారు. మరో మూడు గంటల్లో వారు హైదరాబాద్ కు చేరుకుంటారు అనగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుని విషాదం నింపింది.












Click it and Unblock the Notifications