హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాహనదారులకు శుభవార్త.. గూగుల్ తో ఒప్పందం; హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ ల సమస్యను పరిష్కరించడం కోసం ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అనేక విధానాలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాఫిక్ జామ్ సమస్యల పరిష్కారం కోసం మరో కొత్త విధానాన్ని అమలు చేయడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని ఇబ్బందులు పడే వాహనదారులకు శుభవార్త చెప్పారు.

ట్రాఫిక్ జామ్ ల పరిష్కారం కోసం గూగుల్ తో ఒప్పందం

ట్రాఫిక్ జామ్ ల పరిష్కారం కోసం గూగుల్ తో ఒప్పందం


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహన రాకపోకలను నియంత్రిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తరచుగా తలెత్తుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యలను అధిగమించడం కోసం కొత్త విధానాన్ని అమలు చేయడానికి గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సంస్థ ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, ర్యాలీలు, ధర్నాలు, వీవీఐపీల రాకలకు సంబంధించి అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ జామ్ ల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు సమాచారం అందించే విధంగా గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ చేయనున్నారు.

కొత్త విధానంతో 15 లక్షల నుండి 20 లక్షల మంది వాహనదారులకి లబ్ది

కొత్త విధానంతో 15 లక్షల నుండి 20 లక్షల మంది వాహనదారులకి లబ్ది


ఇక దీని కోసం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్ఐల మొబైల్ ఫోన్లను ఈ యాప్ను ఇన్స్టాల్ చేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసేలా చొరవ తీసుకోనున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావడం తో పాటుగా ప్రతిరోజు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ యాప్ పనితీరును పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. భారీ ట్రాఫిక్ తో సతమతమౌతున్న నగరవాసులకు కాస్త ఊరట ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా గూగుల్ తో కలిసి ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న దారులపై ట్రాఫిక్ జామ్ లతో ఇబ్బంది

ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న దారులపై ట్రాఫిక్ జామ్ లతో ఇబ్బంది

నగరంలో ట్రాఫిక్ జామ్ పై సమాచారాన్ని గూగుల్ మ్యాప్ లో ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అయితే ప్రధాన కూడళ్లు ముఖ్య ప్రాంతాలలో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కమాండ్ కంట్రోల్ నుంచి ట్రాఫిక్ పరిపాలన విభాగం సమాచారం నమోదు చేస్తోంది. ఇక ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారులపై అనుకోకుండా జరిగే ఘటనలు, ర్యాలీలు వల్ల కలిగే ట్రాఫిక్ జామ్ లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడం లేదు .దీంతో ఆయా ప్రాంతాలలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.

Recommended Video

Google Gets Bigger In Hyderabad ప్రపంచంలోనే అతి పెద్ద రెండో కార్యాలయం | Telugu Oneindia
మొబైల్ యాప్ ద్వారా గూగుల్ కు డేటా పంపితే మ్యాప్ లో అప్డేట్

మొబైల్ యాప్ ద్వారా గూగుల్ కు డేటా పంపితే మ్యాప్ లో అప్డేట్

ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు మొబైల్ యాప్ లో ఫోటోలు తీసిన, వివరాలు పంపినా ఆ సమాచారం కమాండ్ కంట్రోల్ కు వెళ్లి గూగుల్ మ్యాప్ లో చూస్తున్న వారందరికీ అప్డేట్ అయి కనిపిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వెళ్లే వారికి ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. ఏ ఏరియా లో రోడ్లు ఫ్రీగా ఉన్నాయన్న సమాచారం తెలుస్తుంది. దీంతో ఏ రూట్ లో వారు ప్రయాణం చెయ్యొచ్చో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.

English summary
Hyderabad traffic police told good news to motorists. Telangana govt has signed a deal with Google to check traffic jams in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X