వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న కేటీఆర్: డెల్టా వేరియంట్ మరో 2 నెలలు, కరోనా పట్ల జాగ్రత్తంటూ డీహెచ్
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమై చాలా కాలమైనప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు.
Got my first jab today
— KTR (@KTRTRS) July 20, 2021
Thank you Dr. Sree Krishna, Nurse Kerina Jyothi and all the healthcare workers who have been terrific #FrontlineWarriors 🙏#VaccinesWork #VaccinationDrive #TelanganaFightsCorona pic.twitter.com/ZjrYq1f3tY
అయితే, ఇటీవల కరోనావైరస్ బారినపడటంతో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు మంగళవారం మంత్రి కేటీఆర్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు జ్యోతిలతోపాటు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఇది ఇలావుండగా, డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించాయని, ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే, వరుస పండగల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజల నిర్లక్ష్యమ కరోనా వ్యాప్తికి కొరణమవుతోందని, అందుకే ప్రజలంతా బాధ్యతగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.
రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని, కొందరు నాయకులైతే మాస్కులు కూడా ధరించడం లేదన్నారు. నిరంతరంగా వైద్యసేవలందిస్తున్న వైద్య సిబ్బందితోపాటు కరోనా విధుల్లో పోలీసు, మున్సిపల్ సిబ్బంది కూడా అలసిపోయారన్నారు. ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుంటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications