రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్ : వరంగల్ ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని రవళి సోమవారం సాయంత్రం కన్నుమూసింది. మంగళవారం నాడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తిచేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాస్పిటల్ కు వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రవళిపై దాడికి తెగబడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి. అలాగే ఆమె కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. రవళి కోలుకోవాలని మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఆమె చనిపోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రి ఖర్చంతా ప్రభుత్వమే భరించిందని తెలిపారు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం వరంగల్ పోలీసులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications