సిటీలో స్వైన్ ఫ్లూ టెర్రర్.. నెలరోజుల్లో భారీగా పెరుగుదల, లక్షణాలివీ..
విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, వైరల్ ఫీవర్‌తో జనం అల్లాడుతున్నారు. ఇదీ చాలదు అన్నట్టు హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని లక్షణాలు.. మిగతా ఫ్లూ, వైరస్ లక్షణాలు సేమ్ కావడం.. ఓకే చోట టెస్టులు చేయడంతో కేసుల సంఖ్య తెలియడం లేదు.. కానీ కేసులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.

స్వైన్ ఫ్లూ కలకలం..
సిటీలో స్వైన్ ఫ్లూ కేసులు మూడేళ్ల తర్వాత ఎక్కువగా నమోదవుతున్నాయి. నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు వస్తున్నాయని వైద్యశాఖ తెలియజేసింది. ప్రతి వారం 15 కేసులు వస్తున్నాయట. అన్ని హాస్పిటల్స్ లో స్వైన్ ఫ్లూ టెస్ట్ లు చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన కేసుల్లో.. సస్పెక్ట్ చేస్తేనే ఫీవర్ హాస్పిటల్‌కు రిఫర్ చేస్తున్నారు. అక్కడ రోగుల నుంచి రక్త నమూనాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపిస్తున్నారు.

కేసుల హై
శ్వాసకోశ పరమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయట. కేసుల్లో స్పష్టమైన పెరుగుదల ఉందని అంటున్నారు. అన్ని చోట్ల హెచ్1ఎన్1 పరీక్షలు చేయడం లేదు.. దీంతో కేసులు తెలియడం లేదు. శ్వాస కోస సమస్యలు కనిపిస్తుండడంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. స్వైన్ ఫ్లూను తొలుత 2009లో గుర్తించారు. 2019లో దీన్ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే కరోనా వైరస్ ప్రపంచం మీద దండెత్తింది. ఆ తర్వాత కరోనా సమస్యలతో ఇప్పటికీ చాలా మంది బాధపడుతున్నారు.

ఇవీ లక్షణాలు.. కానీ
స్వైన్ ఫ్లూ వస్తే జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఇతర ఫ్లూ వైరస్, కరోనాలో కనిపిస్తున్నాయి . అన్ని చోట్లా స్వైన్ ఫ్లూ గా అనుమానించి హెచ్1ఎన్1 పరీక్షలు చేయడం లేదని వైద్య వర్గాలు తెలిపాయి. శ్వాసకోస సమస్య ఎక్కువగా ఉంటే.. వైద్యులను వెంటనే సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే మాములు ఫీవర్‌గానే భావించాలని చెబుతున్నారు.