Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విషం కక్కారు! మోడీ ప్రసంగంపై విరుచుకుపడ్డ హరీశ్ రావు సహా మంత్రులు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో చేసిన ప్రసంగంపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని.. తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందన్నారు ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం మోడీకే చెల్లిందని విమర్శించారు.

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందన్నారు హరీశ్ రావు. తన వల్లే డీబీటీ మొదలైటన్లు చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఐటీఐఆర్ ను బెంగళూరుకు తరలించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. నిజానికి కేంద్రమే రాష్ట్రానికి సహకరించట్లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

 Harish Rao slams PM Modi

ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉందని మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎందులో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది కుటుంబపాలన కానేకాదని.. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబమని అన్నారు. కేసీఆర్ కు ప్రజల ఆమోదం ఉందని.. మోడీ సచ్ఛీలుడైతే అదానీపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని మంత్రి డిమాండ్ చేశారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మోడీ ప్రసంగంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందన్నారు. సిగ్గుందా? అంటూ ప్రధానిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 Harish Rao slams PM Modi

తెలంగాణ డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న మోడీకి సహకరించాలా? రూ. 400 ఉన్న గ్యాస్ రూ. 1200 వందలు చేసినందుకు మోడీకి సహకరించాలా? తెలంగాణలో సింగరేణి లాభాల బాటలో పయనిస్తుండటం వల్ల.. సింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులు వేలం కుట్రలు నిజం కాదా? అని ప్రశ్నించారు. మోడీకి భార్యా పిల్లలు ఉంటే కుటుంబాలు పడే బాధలు అర్థం అవుతాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ దొరికిన బండి సంజయ్‌ను ప్రశంసించిన మోడీకి సహకరించాలా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిది ఏళ్లలో ఒక్క గడ్డపార కూడా ఇవ్వలేదన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేస్తే కచ్చితంగా ఆ పాపం నిన్ను వెంటాడుతదన్నారు. తమపై ఏ కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామని..ఎట్టి పరిస్థితుల్లో మోడీకి సహకరించే ప్రసక్తే లేదన్నారు. మోడీని గద్దె దింపే వరకు వదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు మంత్రి ఎర్రబెల్లి. గోవిందా హరి గోవిందా నరేంద్ర మోడీ గోవిందా అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ సభలో నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మోడీ అధికార కార్యక్రమంలో రాజకీయాలు మాత్రమే మాట్లాడారన్నారు. తెలంగాణపై ఆయనకు ప్రేమలేదని, ఇందుకు గతంలో రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. అవినీతి గురించి మోడీ మాట్లాడుతున్నారని.. అదానీ అవినీతి సంగతేంటని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి గురించి మోడీ నాతో చర్చకు వస్తారా? అని నిలదీశారు.

రంగారెడ్డి రూపురేఖ‌లు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు ప‌క్క‌న పెట్టార‌ని ప్ర‌ధాని మోడీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డినిల‌దీశారు. ప్ర‌ధాని మోడీ విభ‌జ‌న హామీలు నెర‌వేర్చకుండా.. రాజ‌కీయ ప్ర‌సంగాలు చేసి వెళ్లిపోయార‌ని మంత్రి ధ్వ‌జ‌మెత్తారు. ఇక మరికొందరు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కూడా మోడీ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+