హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేగంగా ఈదురుగాలులు వీచాయి. దీంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, నిజాంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోలు, తార్నాక, పటాన్‌చెరు, లంగర్‌హౌస్ , కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిపిపోయాయి. ఈదురుగాలు వేగంగా వీస్తుండటంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో వర్షం కురిసినప్పటికీ ఎలాంటి ట్రాఫిక్ కు అవకాశం లేకపోయింది.

Heavy rain in Hyderabad and some districts in Telangana.

మరో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

ఉత్తర-దక్షిణ ద్రోణి విచ్చిన్నతి చెంది శుక్రవారం బలహీనపడింది. ఉపరితల ద్రోణి విదర్భ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు ఏర్పడింది.
ఆగ్నేయ అరేబియా సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి లక్ష ద్వీప్, పక్కనేవున్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీద వాయుగుండంగా శుక్రవారం ఉదయం ఏర్పడింది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశాలున్నాయి.

మొదట మరింత బలపడి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి.. తర్వాత దిశను మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గుజరాత్ తీరాన్ని 18వ తేదీ ఉదయానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి(మే 15,16 తేదీల్లో) కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడనుంది. తెలంగాణ దక్షిణ జిల్లాలపై ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

English summary
Heavy rain in Hyderabad and some districts in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X