హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశవ్యాప్తంగా కరోనావైరస్ నిత్యావసర సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారం

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. 200కు పైగా దేశాల్లో ఈ మహమ్మారి కోరలు చాచింది. ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా మృతి చెందగా 20 లక్షలకు పైగా చికిత్స పొందుతున్నారు. భారత్‌లో కూడా కరోనావైరస్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభత్వం లాక్‌డౌన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

మార్చి 25 నుంచి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇక వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ప్రజలు మాత్రం అత్యవసరమైతే తప్ప ఇళ్లను వదిలి బయటకు రావొద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదు.

Here is the complete info about Coronavirus Essential services across India

ఇక కరోనావైరస్‌ను నియంత్రించాలంటే ఇళ్లకే పరిమితం కావడం ఒక చర్య అయితే సామాజిక దూరం పాటించడం ప్రధానమైన విషయమని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక లాక్‌డౌన్‌తో ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ ప్రకటనకు ముందు ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయారు.

ఇక ప్రజల ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వాలు అత్యవసర సేవలకు సంబంధించి ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారంను విడుదల చేసింది. అంతేకాదు నిత్యావసర సేవల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోన్ నెంబర్లను ఇతర సమాచారంను విడుదల చేసింది. ఇందులో టెస్టింగ్ ల్యాబులు ఎక్కడ ఉన్నాయి, హాస్పిటల్స్, విరాళాలు ఇవ్వాల్సిన సమాచారం, ఉచితంగా ఆహారం ఎక్కడ పెడతారు తదితర అంశాలతో కూడిన ముఖ్య సమాచారంను విడుదల చేసింది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికోసం నిత్యావసర సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారం వన్‌ ఇండియా అందిస్తోంది. సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Here is the complete info about Coronavirus Essential services across India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X