ఇక గురుకులాలు.. ఓపెన్‌కు హై కోర్టు ఓకే.. అనుమతి ఇవ్వడంతో..
కరోనా తగ్గుముఖం పట్టింది. క్రమంగా మార్కెట్లు తెరచుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలు కూడా ఓపెన్ అయ్యాయి. ఇంకేముంది.. గురుకులాలు కూడా ఓపెన్ అవబోతున్నాయి. దీంతో అన్నీ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దృష్ట్యా గురుకులాలు ప్రారంభించాలని, గురుకులాల పున:ప్రారంభంపై స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే.
గురుకులాలు తెరవొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నిబంధనలను అనుసరిస్తూ మిగిలిని పాఠశాలలు నడుస్తున్నాయని ప్రభుత్వం తరఫున లాయర్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితుల దృష్ట్యా పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని ప్రభుత్వ లాయర్ సోమవారం కోర్టును కోరారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్ లైన్ బోధన చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. గురుకులాలను తెరవద్దని జారీ చేసిన గత ఆదేశాలను సవరిస్తూ ఇప్పుడు గురుకులాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications