తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్.. ముగ్గురు అధికారులకు జైలు..!

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు మొట్టికేయలు వేసిన న్యాయస్థానం.. మరోసారి షాక్ ఇవ్వడం చర్చానీయాంశమైంది. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తున్న తరుణంలో.. హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పుతో వారికి మరో అస్త్రం దొరికినట్లైంది. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసులో న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 కోర్టు ధిక్కారణ.. ముగ్గురికి జైలు

కోర్టు ధిక్కారణ.. ముగ్గురికి జైలు

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. హైకోర్టు తాజా తీర్పుతో ఇరకాటంలో పడినట్లైంది. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఇప్పటికే అపొజిషన్ లీడర్లు భగ్గుమంటున్నారు. ఆ క్రమంలో ఇదివరకు హైకోర్టు చాలాసార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అదలావుంటే హైకోర్టులో నడుస్తున్న మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసులో ఊహించని తీర్పు రావడం ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే పరిస్థితి నెలకొంది.

మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కేసుకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. అయితే కోర్టును ధిక్కారించారనే కారణంతో ముగ్గురు అధికారులకు శిక్ష విధించింది. సిద్ధిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాదు ఆ ముగ్గురికి రెండు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.

 ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఇదేమీ కొత్త కాదుగా..!

ప్రభుత్వానికి మొట్టికాయలు.. ఇదేమీ కొత్త కాదుగా..!


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో మొట్టికాయలు వేసింది. పంచాయతీ ఎన్నికల కోసం బీసీ గణన నిర్వహించలేదనే పిటిషన్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఆ మేరకు బీసీ గణన చేశాకే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిన సందర్భాలున్నాయి. అలాగే సాగు నీటి ప్రాజెక్టులు తదితర విషయాల్లో కూడా ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.

ఏప్రిల్ నెలలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి తలంటింది హైకోర్టు. మియాపూర్ భూముల విషయంలో సేల్ డీడ్ రద్దు చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. దాంతో సేల్ డీడ్ రద్దు ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యేంత వరకు స్టే విధించింది. అంతేగాకుండా మియాపూర్ భూములను యధావిధిగా ఉంచాలని..స్టేటస్‌ కో ఆర్డర్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల న్యాయస్థానాలకు సానుభూతి ఉండబోదని స్పష్టంచేసింది.

 కొత్త భవనాలు ఎందుకు.. ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు

కొత్త భవనాలు ఎందుకు.. ప్రభుత్వానికి తలంటిన హైకోర్టు

ఇటీవల సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణాలపై కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత నిర్మాణాలు వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. వాటి నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్స్.. అలాగే వాటిని నిర్మాంచాల్సిన అవసరాలు తదితర వివరాలతో కూడిన నివేదిక న్యాయస్థానానికి అందించాలని ఆదేశించింది.

తాజాగా ఇంజ‌నీరింగ్ కాలేజీల వ్య‌వ‌హారంలోనూ.. తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పుడు ప్ర‌తిపాదించిన ఫీజుల‌ను కాలేజీలు వ‌సూలు చేసుకోవ‌చ్చ‌ని న్యాయస్థానం తెలిపింది. ఏఎఫ్ఆర్సీ నిర్థారించిన దానిక‌న్నా ఎక్కువ ఫీజు వ‌సూలు చేస్తే..ఆ మొత్తాన్ని విద్యార్థుల‌కు వాప‌సు చేయాల‌ని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+