హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెయిన్ ఎఫెక్ట్: వందలాది గ్రామాల రాకపోకలకు అంతరాయం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాతో రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యింది. నిర్మల్, భైంసా పట్టణాలు నీట మునిగాయి. మురంభీం జిల్లా వాంకిడిలో నిన్న అత్యధికంగా 27.30 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

భారీ వర్షాలతో గోదావరి పరిధిలో గల అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం వెంకూరు చెరువుకట్ట తెగడంతో చేను పనులకు వెళ్లిన దంపతులు చిక్కుకుపోగా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కుమురం భీం జిల్లాలోని చింతలమాదర జలపాతంలో మొన్న గల్లంతైన మహారాష్ట్రకు చెందిన రాంవిజయ్ లోబడే చనిపోయాడు.

hundred villages transportation struck due to heavy rains

వరంగల్ జిల్లాలో ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం 19 అడుగులకు చేరుకుంది. లక్నవరం సరస్సులో 27 అడుగులు, రామప్ప చెరువలో 31 అడుగులకు నీటిమట్టం చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 16 అడుగులకు చేరింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్‌పల్లి పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో వరినాట్ల కోసం వెళ్లిన 21 మంది కూలీలు చిక్కుకుపోయారు. పోలీసులు వారిని రక్షించారు.

అనంతారం వాగులోకి గత రాత్రి వేగంగా వచ్చిన ఓ కారు బారికేడ్లను ఢీకొడుతూ వెళ్లి వాగులో పడి కొట్టుకుపోయింది. ఇద్దరు గల్లంతయ్యారు. నిజామాబాద్ జిల్లా మెండోరాలో ఓ ఆశ్రమాన్ని వరద నీరు చుట్టేయడంతో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు బయలుదేరారు. భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. అల్పపీడనం నేపథ్యంలో మరో రెండు రోజుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అందుబాటులో ఉండాలంటూ అధికారులను ఆదేశించింది.

English summary
hundred villages transportation struck due to heavy rains in the telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X