Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోషల్ మీడియాకు భార్య అంకితం.. విసిగి వేసారి భర్త సూసైడ్..

సోషల్ మీడియా జీవితాలను ఛిద్రం చేస్తోంది. యువతే కాదు.. ఆలు మగల మధ్య కూడా విభేదాలకు దారితీస్తోంది. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్ మోజులో పడిన ఓ భార్య వల్ల భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్‌నగర్ సమీపంలోని ఫతేనగర్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలం వరకు వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ప్రియాంకకు సోషల్ మీడియా అలవాటు ఎక్కువ అయ్యింది. రాత్రికిరాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతడంతో ప్రియాంక సోషల్ మీడియాకే అంకితం అయిపోయింది.

husband suicide for his wife behaviour

ఇది గమనించిన భర్త పవన్.. ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారు. ప్రియాంక ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో భర్త విసుగు చెంది ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లిఖిత పూర్వక ఫిర్యాదు పోలీసుస్టేషన్‌లో అందజేశారు.

Recommended Video

    Shakib Al Hasan lashes out at stumps in anger, twice in one DPL game | Oneindia Telugu

    సోషల్ మీడియా ద్వారా భర్తను పట్టించుకోకపోవడం కలకలం రేపింది. కట్టుకున్న భర్త బాధను పట్టించుకోకపోతే ఏం చేయాలి.. తన బాధను ఎవరితో చెప్పుకోవాలె తెలియలేదు. ఇక జీవతం చాలు అని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారి కుటుంబానికి శోకాన్ని తీరాని మిగిల్చాడు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+