ఖరీదైన ఎన్నికగా మార్చారు: నిరోషతో కలిసి ఎస్ఈసీకి రేవంత్ కంప్లైంట్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నారని... అలాంటి పిరికి వాళ్ల గురించి ఏం మాట్లాడతామని అన్నారు. బీసీలపై దళితులను ఉసిగొల్పేలా సీఎం కేసీఆర్ చర్యలు ఉంటున్నాయని దుయ్యబట్టారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి మహబూబ్ నగర్‌కు వచ్చారని ఎద్దేవా చేశారు. తండ్రి కేసీఆర్ సంపాదించింది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నారని అన్నారు. తండ్రీ కొడుకులకు తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెపుతారని కామెంట్ చేశారు.
అధికార దుర్వినియోగం
హుజురాబాద్ బై పోల్‌లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి.. ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు, పోలీసులు నిరోషపై దాడి చేశారని.. ఆమెతో కలిసి కంప్లైంట్ చేశారు. ఉద్యోగాల గురించి అడిగితే దాడి చేస్తారా అని అడిగారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలు వందల కోట్లు వెదజల్లుతున్నాయని కామెంట్ చేశారు. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన వెంకట్‌పై దాడి చేశారని చెప్పారు. హరీశ్- ఈటల మధ్య పంపకాల మధ్య తేడా వచ్చిందని తెలిపారు. దళితబంధు ఆపడం కూడా ప్రణాళిక ప్రకారమే జరిగిందని చెప్పారు.

ఎవరినీ వరించేనో
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

బ్రేక్ పడిందిగా..
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications