హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?

|
Google Oneindia TeluguNews

భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్పుకునే మనం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న యాచకులను , వారి దౌర్భాగ్య పరిస్థితులను చూసి మన దేశం గురించి మనకు తెలీకుండానే ఆలోచనలో పడుతున్నాం . ఇక వీరి గురించి మనమే కాదు కేంద్రం కూడా ఆలోచించింది. అందుకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

8 లక్షలు విరాళంగా గుడికి ఇచ్చిన యాచకుడు: బిచ్చగాడి ఔదార్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !!8 లక్షలు విరాళంగా గుడికి ఇచ్చిన యాచకుడు: బిచ్చగాడి ఔదార్యానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !!

హైదరాబాద్ లో విపరీతంగా బిచ్చగాళ్ళు

హైదరాబాద్ లో విపరీతంగా బిచ్చగాళ్ళు

దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో యాచకులు విపరీతంగా పెరిగిపోయారు. ఎక్కడ చూసినా వారే దర్శనం ఇస్తున్నారు. రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద, దేవాలయాల వద్ద, ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు.

యాచక రహిత నగరంగా మార్చే ఆలోచనలో కేంద్రం

యాచక రహిత నగరంగా మార్చే ఆలోచనలో కేంద్రం


ఇక ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ను యాచక రహిత నగరంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. యాచకులపై దృష్టి పెట్టిన కేంద్రం యాచకుల రహిత దేశంగా మార్చేందుకు కొన్ని పధకాలు తయారు చేసింది. దీనిని మొదటగా హైదరాబాద్ నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పునరావాసం కల్పించి, ఆర్ధికంగా ఎదిగేందుకు చేయూత ఇవ్వాలని నిర్ణయం

పునరావాసం కల్పించి, ఆర్ధికంగా ఎదిగేందుకు చేయూత ఇవ్వాలని నిర్ణయం


యాచకులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించటమే కాకుండా వారికి ఆర్ధికంగా ఎదిగేందుకు కావలసిన నైపుణ్యం పెంచుకోవడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది.చాలా కాలంగా యాచక వృత్తిలో ఉన్న వాళ్ళను మార్చాలని నిర్ణయం తీసుకుంది . ఇక యాచకులను లేకుండా చేసి వారికి జీవనోపాధి కల్పించేందుకు కేంద్రం జీహెచ్ఎంసి తో కలిసి దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నది.

బెగ్గింగ్ మాఫియా మారుతుందా ? పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా

బెగ్గింగ్ మాఫియా మారుతుందా ? పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా

హైదరాబాద్ లో ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, మిగతా ప్రాంతాలలో కూడా దీనిని అమలుచేసే అవకాశం ఉన్నది. కానీ హైదరాబాద్ వంటి మహా నగరంలో బెగ్గింగ్ ఒక మాఫియాగా మారిన వేళ ఈ బెగ్గింగ్ గ్యాంగ్ లు కష్టపడి జీవనం సాగించమంటే వింటారా ? భిక్షాటన ఆపేస్తారా అనేది చూడాల్సి ఉంది .

English summary
The decision to revoke the begging system has been implemented by the Center. Decided to make Hyderabad a non-beggar city. The Center focused on beggars and has made some plans to make it a beggar-free country. The decision to first run it as pilot project from Hyderabad .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X