హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబడులకు అయస్కాంతంగా.. వ్యాక్సిన్ క్యాపిటల్‌గా... ఇదీ హైదరాబాద్ డెవలప్‌మెంట్... : మంత్రి కేటీఆర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అయస్కాంతంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగిందన్నారు.
ప్రగతిశీల విధానాలు,సుస్థిర పాలన,సమర్థమైన శాంతిభద్రతల నిర్వహణ కారణంగానే ఇది సాధ్యపడిందన్నారు. అభివృద్దిలో దూసుకుపోతున్న హైదరాబాద్ వైపు దేశమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే... ఉన్న కంపెనీలే పారిపోతాయని.. రాష్ట్రం అంధకారం అవుతుందని జరిగిన విష ప్రచారాలన్నీ కొట్టుకుపోయాయన్నారు. ఎక్కడా గిల్లికజ్జాలకు తావు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో కేసీఆర్ ముందుకు సాగుతుండటం వల్లే హైదరాబాద్ నగరం ఈనాడు ఇంత ప్రశాంతంగా ఉందన్నారు. గురువారం(నవంబర్ 19) మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఒకప్పుడు 14 రోజులకు ఒకసారి తాగునీళ్లు...

ఒకప్పుడు 14 రోజులకు ఒకసారి తాగునీళ్లు...

ఒకప్పుడు జలమండలి ముందు మహిళలు బిందెలు పట్టుకుని నిలుచునేవారని కేటీఆర్ గుర్తుచేశారు. 14 రోజులకు ఒక్కసారి మంచినీళ్లు వచ్చే దుస్థితి ఉండేదన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. రూ.2వేల పైచిలుకు కోట్ల ఖర్చుతో శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేక తాగునీటి రిజర్వాయర్ నిర్మించినది ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కేశవపురంలో రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

24వేల మెగావాట్ల విద్యుత్...

24వేల మెగావాట్ల విద్యుత్...

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగిన తొలినాళ్లలోనే సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కేంద్రం అన్యాయంగా ఏపీలో కలిపిందని ఆరోపించారు. ఆరేళ్లలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త... ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని పేర్కొన్నారు. తెలంగాణ నేడు మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రమని చెప్పారు. అతి త్వరలోనే 24వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం దిశగా తెలంగాణ అడుగులు వేస్తుందన్నారు. ఒకనాడు పవర్ హాలీ డేలు ఉ:డేవని... ఇప్పుడు ఆదివారం నాడు కూడా పరిశ్రమలు నడుపుకునే వెసులుబాటు ఏర్పడిందని అన్నారు.

పారిశుద్ధ్యంలో నంబర్ 1..

పారిశుద్ధ్యంలో నంబర్ 1..

ప్రధాని పిలుపు కంటే ముందే స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో కేవలం 3500 టన్నుల చెత్త సేకరణ జరిగేదని... ఇప్పుడు 6వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోందని తెలిపారు. మొత్తం 3200 స్వచ్చ ఆటోలను ఇందుకోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలోని మహా నగరాలన్నింటిల్లో పారిశుద్ధ్యంలో హైదరాబాదే అగ్ర భాగాన ఉందన్నారు. త్వరలోనే మరో మూడు డంపింగ్ యార్డులు అందుబాటులోకి వస్తాయన్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో నెలకొల్పామన్నారు.

ఆ విషయంలో ఒకే ఒక్క నగరం...

ఆ విషయంలో ఒకే ఒక్క నగరం...

భారతదేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. అత్యంత సురక్షితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులు లేవు,గుడుంబా స్థావరాలు లేవన్నారు.బాంబు పేలుళ్లు లేవు,అల్లర్లు లేవు,కర్ఫ్యూలు లేవు,మత కల్లోలాలు లేవు,ఆకతాయిల ఆగడాలు లేవని గుర్తుచేశారు.స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ కింద .137 లింకు రోడ్లు,పలు ఫ్లైఓవర్స్ నిర్మించామన్నారు.

మరోవైపు రహదారుల విస్తరణ పెద్ద సంఖ్యలో జరుగుతోందన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దసరా నాటికే ఇవ్వాలనుకున్నప్పటికీ... కరోనా కారణంగా కార్మికులు అందుబాటులో లేక ఇవ్వలేకపోయామన్నారు. ఇప్పుడు వాటి నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయన్నారు. రూ.9714కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన నగరం దేశంలో మరొకటి లేదన్నారు. ఇప్పటికే లక్ష ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేశామన్నారు.

పెట్టుబడులకు అయస్కారం...

పెట్టుబడులకు అయస్కారం...

మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన కోసం టీఎస్ఐపాస్ తీసుకొచ్చామన్నారు. గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ నగరానికి రూ.2లక్షల కోట్ల పెట్టబడులు వచ్చాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టాప్ 5 కంపెనీలు... గూగుల్,అమెజాన్,ఫేస్‌బుక్,యాపిల్ హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయన్నారు.

భారత్‌లో మహిళల కోసం ఎంట్రప్రెన్యూర్ హబ్ ఏర్పాటైంది ఒక్క హైదరాబాద్‌లోనే అని గుర్తుచేశారు. గ్రిడ్ పాలసీ ద్వారా ఉప్పల్,కొంపల్లిలో కొత్తగా ఐటీ పార్కులు రాబోతున్నాయన్నారు. సౌత్ హైదరాబాద్‌లో పాతబస్తీకి వెనకాల కూడా పలు కొత్త కంపెనీలు ఏర్పాటువుతున్నాయని చెప్పారు. జీవ ఒకరకంగా హైదరాబాద్ పెట్టుబడులకు అయస్కాంతంగా మారిందని... జీవ ఔషధ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ కేపిటల్‌గా ఎదిగిందని అన్నారు.

English summary
Telangana IT minister KTR said Hyderabad city become like a magnet in attracting investments from around the globe said minister KTR in meet the press meeting at Somajiguda press club on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X