జాతీయ జెండాను అలా వదిలేసి..కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు: చిరిగిన కార్పొరేటర్ చొక్కా
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి-భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య హైదరాబాద్‌లో ఘర్షణ తలెత్తింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. తన్నుకున్నారు.. తోసుకున్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసే విషయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘర్షణల సందర్భంగా బీజేపీ కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి. ఆయన చొక్కా చిరిగిపోయింది. దీనితో కార్పొరేటర్, ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మల్కాజ్‌గిరిలో ఘటన..
హైదరాబాద్ మల్కాజ్‌గిరి డివిజన్ పరిధిలో ఈ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీకి చెందిన స్థానిక కార్పొరేటర్ వీ శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా వినాయక్ నగర్‌కు చేరుకున్నారు. టీఆర్ఎస్‌కు చెందిన స్థానిక శాసన సభ్యుడు మైనంపల్లి హనుమంతరావు అనుచరులుగా వారిని భావిస్తోన్నారు.

జాతీయ జెండా ఎగువేసే సమయంలో..
తమ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగరవేయాల్సి ఉందంటూ శ్రవణ్ కుమార్‌ను అడ్డుకోవడంతో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. జాతీయ జెండాను ఆవిష్కరించడానికి కొన్ని క్షణాల ముందు.. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు ఘర్షణకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు.. తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీనితో స్థానికంగా వినాయక్ నగర్‌లో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో వినాయక్ నగర్ ప్రాంతం మారుమోగిపోయింది.
కాలికి గాయం.. చిరిగిన చొక్కా..
ఈ ఘర్షణల్లో మల్కాజ్‌గిరి కార్పొరేటర్, బీజేపీ నాయకుడు శ్రవణ్ కుమార్ కాలికి గాయమైంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులే తనను తీవ్రంగా కొట్టారంటూ ఆయన ఆరోపించారు. ఆయన చొక్కా మొత్తం చిరిగిపోయింది. కుడికాలికి తీవ్ర గాయమైంది. రక్తమోడుతోన్న కాలితోనే ఆయన అక్కడే కూర్చున్నారు. రోడ్డు మీద పడుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రవణ్ కుమార్‌కు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు సర్దిచెప్పినా..
మైనంపల్లి హనుమంత రావు అనుచరులు తనపై బీర్ బాటిల్‌తో దాడులు చేశారంటూ శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వినాయక్ నగర్‌కు చేరుకున్నారు. శ్రవణ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తామని చెప్పగా.. అందుకు ఆయన అంగీకరించలేదు. తనపై దాడి చేసిన వారిని మొదట అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలను తాము అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క పెట్టలేదని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Recommended Video

టీఆర్ఎస్ ఆందోళన..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవంక- టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకులు డ్రామా ఆడుతున్నారంటూ మండి పడుతున్నారు. తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని చెబుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఉద్దేశపూరకంగానే బీజేపీ నాయకులు ఉద్రిక్త పరిస్థితులను కల్పిస్తోన్నారని ఆరోపిస్తోన్నారు. శ్రవణ్ కుమార్ కాలికి గాయం ఎలాగైందో తమకు తెలియదని అంటున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications