హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫార్ములా ఈ రేస్‌కు హైదరాబాద్ రెడీ: ఈ తేదీల్లో ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్ బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరం ప్రతిష్ఠాత్మక ఫార్ములా ఈ రేస్ కోసం సిద్ధమైంది. ఫార్ములా ఈ ట్రయల్ రన్ కోసం రేసర్లు హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. ఇటలీ నుంచి 14 మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుంది. ఈ రేసర్లు హుస్సేన్‌సాగర్ తీరాన ఎన్టీఆర్ మార్గ్‌లో కాలినడకన తిరుగుతూ ట్రాక్‌ను పరిశీలించారు. ఈ శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములా ఈ ట్రయల్ రన్‌లో పాల్గొననున్నారు.

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. నవంబర్ 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగ‌ర్ తీరాన ఇండియ‌న్ రేసింగ్ లీగ్ ట్రైయల్‌ రన్‌ ప్రారంభం కానుంది. రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్‌కో సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా ఈ రేసింగులను నిర్వహించనుంది.

18-21 వరకు ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కులు క్లోజ్

ఫార్ములా ఈ రేస్ నిర్వహణ నేప‌థ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కుల‌ను నవంబర్ 18 నుంచి 20వ తేదీ వ‌ర‌కు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నవంబర్ 21వ తేదీ నుంచి య‌థావిధిగా పార్కులు తెరుచుకోనున్నాయి.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం ముమ్మర ఏర్పాట్లు

ఈ రేసింగ్‌ పోటీల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 2.3 కిలోమీటర్ల పాటు ప్రత్యేకంగా రేసింగ్ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తున్నారు. హుస్సేన్ సాగర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ పార్క్, సంజీవయ్య పార్క్ మీదుగా ఈ ట్రాక్ ఉంటుంది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ హుస్సేన్ సాగర్ చుట్టూ జరుగనుంది. రేస్ నడుస్తోన్న సమయంలో అవసరమైన పిట్‌స్టాప్స్, ప్రేక్షకులు తిలకించడానికి వీలుగా సీటింగ్, ఫెన్సింగ్ నిర్మాణం వంటి పనులను చేపట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌‌లో జరగనున్న రేసుతో ఫార్ములా ఈ.. మొదటిసారిగా భారతదేశానికి చేరుకుంటుంది.

ఫార్ములా ఈ రేసింగ్ ఎఫెక్ట్: ట్రాఫిక్ సూచనలు

కాగా, రేసింగ్ పోటీల కోసం నవంబర్‌16 నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగు త‌ల్లి జంక్షన్ల వ‌ద్ద ట్రాఫిక్‌ను మ‌ళ్లిస్తున్నారు. ఖైరతాబాద్‌ జంక్షన్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ జంక్షన్‌, రవీంద్ర భారతి జంక్షన్‌, మింట్‌ కంపౌండ్‌, తెలుగు తల్లి జంక్షన్‌, నెక్లెస్‌ రోటరీ, నల్లగుట్ట జంక్షన్‌, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, కట్టమైసమ్మ ఆలయం రూట్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో వెళ్లొద్దని హైదరాబాద్ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ తెలిపారు. ఆ జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, అనసవసరంగా ఆ రూట్‌లలో వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.

English summary
Hyderabad city ready for Formula E race: NTR garden, marg and Lumbini park will closed on Nov 18th to 20th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X