ట్యాంక్‌బండ్ వైపు కదిలిన ఖైరతాబాద్ మహా గణపతి: రిచ్మండ్ విల్లాలో రూ. 1.26 కోట్లు లడ్డూ వేలం
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జన వేడుకల సందడి కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ సహా సుమారు 100 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర గురువారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైంది. ప్రస్తుతం సెక్రటేరియట్ వద్దకు ఖైరతాబాద్ గణేశుడు చేరుకున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు.
గణపతి బప్పా మోరయా అంటూ వేలాదిగా భక్తులు ఖైరతాబాద్ గణేశుడి వెంట శోభయాత్రలో కదులుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్ సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తి కానుంది. మరోవైపు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్‌కు తీసుకొస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ మార్గంలో భారీగా భక్తుల సందడి నెలకొంది. 40 వేల పోలీసు బలగాలతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. బడా గణేశ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్ వైపు నుంచి వచ్చేవారికి.. పోలీసులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతించానారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. భక్తుల రాకతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇది ఇలావుండగా, బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ప్రారంభమైంది. ఈ వేలంపై సర్వత్రా గణేష్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్-హుస్సేన్ సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నేటి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

The 63 feet eco-friendly Khairatabad Ganesh (clay idol), Shobhayatra reached at Telugu talli flyover, it is the tallest Ganesha in Hyderabad.#KhairatabadGanesh #Hyderabad #ClayIdol#GaneshImmersion #Ganeshotsav2023#GaneshFestival pic.twitter.com/EqowBYbHYe
— Surya Reddy (@jsuryareddy) September 28, 2023
కీర్తి రిచ్మండ్ విల్లాలో రికార్డు ధరకు లడ్డూ
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల లడ్డూ వేలంపాటలు జరుగుతున్నాయి. బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ వేలం రికార్డు స్థాయి ధర పలికింది. రూ. 1.26 కోట్లకు లడ్డూ వేలం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో లక్షల్లో గణేష్ లడ్డూలు భక్తులు సొంతం చేసుకుంటున్నారు.
మరోవైపు, మాదాపూర్‌లోని మైహోమ్ భుజాలోని (My Home Bhooja) గణేశుని లడ్డూని రూ.25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే రూ.7 లక్షలు అధికంగా ధర పలికింది. 2022లో రూ.18.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications