అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాద్ లేడీ టెక్కీ చరితా రెడ్డి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మిచిగాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన యువతి బ్రెయిడ్ డెడ్ అయ్యింది. మిచిగాన్ లాన్‌సింగ్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో హైదరాబాద్‌కు చెందిన చరితా రెడ్డి(25) పనిచేస్తున్నారు.
చరితా రెడ్డి కారును మరో కారు అత్యంత వేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చరితా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ఆమె కారును ఢీకొట్టిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. చరితా రెడ్డి కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమీపంలోని ఆస్పత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చరితారెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేసినట్లు తెలిసింది. చరితారెడ్డి ఆకస్మిక మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications