స్పందించని నగర ఓటర్..! అత్యధికంగా మెదక్.. అత్యల్పంగా సికింద్రాబాద్..!
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం సామాజిక బాధ్యత. నిరక్షరాస్యులు అధికంగా ఉండే పల్లెల్లో ఓటింగ్ శాతం పెరుగుతుంటే.. చదువుకున్నవారు ఎక్కువుండే హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. అదలావుంటే ఈసారి ఎన్నికల్లో కూడా నగర ఓటర్లు సరిగా స్పందించడం లేదనే విషయం ఓటింగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం చూసినట్లయితే మెదక్ లో అత్యధికంగా 36.40 శాతం నమోదైంది. అదే హైదరాబాద్ లో 12.12 శాతం రికార్డయింది. సికింద్రాబాద్ లో అత్యల్పంగా 11.06 శాతం నమోదు కావడం గమనార్హం. మొన్నటి తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ లో ఓటింగ్ తక్కువగా జరిగింది.

తెలంగాణలో ఓటింగ్ నెమ్మదిగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22.84 శాతం ఓట్లు పోలయ్యాయి. మొదటి 2 గంటల్లో కాస్తా నెమ్మదిగానే పోలింగ్ రికార్డయింది. మొత్తమ్మీద రాష్ట్రమంతటా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
ఉదయం 11 గంటల వరకు.. పార్లమెంటరీ సెగ్మెంట్ల వారీగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..
మెదక్ 36.40, మహబూబాబాద్ 32.19, నాగర్ కర్నూల్ 30.16, ఆదిలాబాద్ 27.85, జహీరాబాద్ 27.50, మహబూబ్ నగర్ 27.00, పెద్దపల్లి 27.00, భువనగిరి 26.95, నల్గొండ 26.49, వరంగల్ 25.97, ఖమ్మం 24.00, కరీంనగర్ 22.92, చేవెళ్ల మల్కాజిగిరి 15.77, నిజామాబాద్ 13.00, హైదరాబాద్ 12.12, సికింద్రాబాద్ 11.06












Click it and Unblock the Notifications