హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 నెలల పాపకు పాలిచ్చి ఆకలి తీర్చిన లేడీ పోలీస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పోలీసులంటే కఠినాత్ములనే పేరుంది. పోలీసులంటే చావగొడతారనే భయముంది. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అని రుజువు చేశారు పోలీస్ దంపతులు. వారి మనసుల్లో మానవత్వానికి చోటుందని నిరూపించారు.

గుర్తుతెలియని రెండు నెలల పాపకు తల్లి రూపంలో అండగా నిలిచారు మహిళా కానిస్టేబుల్. గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారికి పాలు అందించి ఆకలి తీర్చారు. అత్యవసర సమయంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన లేడీ కానిస్టేబుల్ కు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

హాట్సాఫ్.. పోలీస్ దంపతుల మానవత్వం

ఆదివారం రాత్రి 11-12 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ కు ఓ యువకుడు వచ్చాడు. ఆయనతో పాటు ఓ రెండు నెలల పాపను తీసుకొచ్చాడు. గుర్తు తెలియని మహిళ మంచినీళ్లకోసం వెళుతున్నానంటూ తనకు పాపను అప్పగించి కానరాకుండా పోయిందనేది ఆ యువకుడు చెప్పిన మాట. సదరు మహిళ ఎంతకూ తిరిగి రాకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ కు వచ్చానని తెలిపాడు. డ్యూటీలో ఉన్న ఈ-కాప్స్ కానిస్టేబుల్ రవీందర్ కు ఆ చిన్నారిని అప్పగించి వెళ్లిపోయాడు. అయితే పాప గుక్కపెట్టి ఏడుస్తుండటంతో పాలు తెప్పించి తాగిపించే ప్రయత్నం చేశారు రవీందర్. అయితే ఆ చిన్నారి ఎంతకూ ఏడుపు మానకపోవడంతో ప్రత్యామ్నాయం ఆలోచించారు.

 పసిపాప ఆకలి.. తల్లిగా ఆదరణ

పసిపాప ఆకలి.. తల్లిగా ఆదరణ

రవీందర్ అఫ్జల్‌గంజ్ పీఎస్ లో పనిచేస్తుండగా.. అతని భార్య ప్రియాంక బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ బాబు ఉన్నాడు. ప్రియాంక ప్రస్తుతం ప్రసూతి సెలవుల్లో ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే ఆదివారం రాత్రి అఫ్జల్‌గంజ్ పీఎస్ కు రెండు నెలల పాపను తీసుకొచ్చిన వైనం భార్యకు వివరించారు రవీందర్. పాప గుక్కపెట్టి ఏడుస్తున్న తీరు ఫోనులో విన్న ప్రియాంక చలించిపోయారు. వెంటనే అఫ్జల్‌గంజ్ పీఎస్ కు వచ్చి ఆకలితో ఉన్న పాపకు పాలిచ్చారు. కడుపునిండా పాలు తాగిన ఆ పాప.. ఏడుపు ఆపేసి చక్కగా నిద్రపోయింది.

బాస్ అభినందనలు..

బాస్ అభినందనలు..

సోమవారం నాడు ఆ పాపను అఫ్జల్‌గంజ్ పీఎస్ నుంచి పేట్లబురుజు ఆసుపత్రికి తరలించారు. అయితే కొన్ని గంటల్లోనే తల్లి ఆచూకీ దొరికింది. ఫిరోజ్ ఖాన్, షబానా బేగం దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఫిరోజ్ ఖాన్ పాత నేరస్థుడు కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. షబానా బేగం చిత్తుకాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఆమె కల్లుకు బానిస కావడంతో పిల్లల పెంపకం ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక్క రోజులోనే ఆచూకీ కనిపెట్టి ఆ చిన్నారిని తల్లి ఒడికి చేర్చడం విశేషం. అత్యవసర సమయంలో ఎలాంటి భేషజాలు లేకుండా మానవత్వం కనబరచిన పోలీసు దంపతులను అభినందించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. వీరి బాబుకు ఓ గిఫ్ట్ కూడా ఇవ్వడం విశేషం.

English summary
An unconventional two-month-old baby constituted a female constable in the mother's form. Gave milk to the crying baby and hunger. Lady Constable, who has proven that humanity is still alive during the emergency, is acclaimed from the superiors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X