మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి.. ఆ పై అత్యాచారం..!
హైదరాబాద్ : అతడికి 30 ఏళ్లు. ఆమెకు 17 ఏళ్లు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే అతడి వేధింపులతో సతమతమైన ఆ బాలిక పెళ్లికి నిరాకరించింది. దీంతో పగపెంచుకుని దారుణానికి ఒడిగట్టాడు.
నాగర్ కర్నూల్ జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన జూపల్లి రామకృష్ణ.. హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలోని సాయినగర్ కాలనీలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ వాటర్ ప్లాంటులో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఎల్బీనగర్ ప్రాంతంలోని ఓ కాలనీకి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. పెండ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డాడు. దీంతో సదరు బాలిక నిరాకరించింది. అయితే తనను కాదన్నదనే కోపంతో ఈనెల 15న ఆమెను బలవంతంగా అపహరించాడు.

మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలంలోని సిసినగల్లికి తీసుకెళ్లాడు. అక్కడి సీతారామ దేవాలయంలో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం నువ్వు నా భార్యవంటూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎలాగోలాగా రామకృష్ణ బారి నుంచి తప్పించుకున్న బాలిక హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications