Hydra: హైడ్రా.. ఎంటిదీ..! మురికి నీరు ఇళ్లలోకి తెస్తారా..!
హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది. చెరువు, పార్కు కబ్జా చేస్తోన్న వారి కొరఢా ఝులిపిస్తోంది. హైడ్రా ఇప్పటికే 18 చెరువు, పార్క భూముల్లో కట్టిన కట్టడాలను కూల్చివేసింది. సుమారు 43 ఎకరాల భూమిని రక్షించింది. ఇప్పటికే చెరువు బఫర్ జోన్ నిర్మించిన భవనాలకు నోటీసులు ఇచ్చింది. గత శనివారం సినీ నటుడు నాగార్జున తుమ్మిడి కుంట చెరువు ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెషన్ కొంత భాగాన్ని కూల్చివేసింది.
దీంతో హైడ్రా పేరు చెప్పగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ నేతలైనా.. బడా బడా వ్యాపారవేత్తలైనా.. ఆఖరికి ముఖ్యమంత్రి కుటుంబీకులైనా హైడ్రా నోటీసులు ఇస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీలో నాళా కబ్జాపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నాలాను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో అధికారులు అడ్డుకుని నాళాను పునరుద్దరించారు.

అయితే నాళా కొంత మేర మాత్రమే అక్రమించారు. దీనిపై బాధితులను సంప్రదించగా.. పెద్ద నాళా కోసం భూమి ఇస్తే చిన్న నాళా భూమి మీరు తీసుకొవచ్చని చెప్పారని తెలిపారు. అలాగే వారు పెద్ద నాళా కోసం భూమి ఇచ్చారు. ఆ భూమికి బదులుగా చిన్న నాళాను వారు మట్టితో పూడ్చారు. దీని వల్ల అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్ద నాళా నుంచి నీరు సంక్రమంగా వెళ్తోంది. అయితే అక్కడున్న స్థానిక నేతలు కావాలనే ఫిర్యాదు చేసి ఇలా చేశారని బాధితులు చెబుతున్నారు.
వన్ ఇండియా క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు అధికారులు జేసీబీ సాయంతో నాళాను పునరుద్దరించారు. అయితే ఆ నాళాకు ఎండు లేదు. 20 మీటర్లు వెళ్లగానే అడ్డుగా గోడ ఉంది. మురికి నీరు అటు వైపు వెళ్తే నీరు నిలిచి దోమలు తయారు అయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. దీనిపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications