Hydra: టార్గెట్ మార్చిన హైడ్రా.. కూల్చివేతలు ఎక్కడంటే..!
హైదరాబాద్ లోని చెరువులు, ప్రభుత్వ భూములు పరిరక్షణగా ఏర్పాటైన హైడ్రా.. దూసుకెళ్తోంది. ఇప్పటికే చెరువుల్లోని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా హైడ్రా స్పీడ్ తగ్గించింది. తాజాగా లేక్ వ్యూ పేరుతో ప్రజలను ఆకర్షితులను చేస్తున్నారు. చాలా మంది బిల్డర్లు, చెరువులను అక్రమించి లేదా చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీల్ లో అపార్ట్ మెంట్లు నిర్మించి లేక్ వ్యూ అని ప్రచారం చేసుకుంటున్నాయి.
ఇప్పుడు హైడ్రా ఇలాంటి ప్రాజెక్టులపై విచారణ చేయనుంది. ఈ ప్రాజెక్టులు బఫర్ లోజన్, ఎఫ్టీఎల్ లో ఉన్నాయా లేదా చెక్ చేయనుంది. హైడ్రా విచారణ చేసే జాబితాలో సాధారణ ప్రాజెక్టులతో పాటు బడా నిర్మాణ సంస్థలకు చెందిన 'లేక్ వ్యూ' ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.
హైడ్రా చర్యలతో చెరువులకు దగ్గర ఉన్న నిర్మాణాల్లో కొనుగోలు చేసేందుకు కస్టమర్లు భయపడుతున్నారు. హైడ్రా త్వరగా విచారణ పూర్తి చేస్తే ఏ ప్రాజెక్టు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లో ఉందో తెలుసుకోవచ్చు.

దీంతో పాటు హైడ్రా హుస్సేన్ సాగర్ పై ఫోకస్ పెట్టనట్లు తెలుస్తోంది. థ్రిల్ సిటీ, జలవహార్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లో నిర్మించారని హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. హుస్సేన్ సాగర్ పక్కకు నిర్మించిన జలవిహార్ పై చర్యలు తీసుకోవాలని తాజాగా సీపీఐ నేతలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సీపీఐ జాతీయ నేత, మాజీ ఎంపీ అజీజ్ పాషా ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. స్సేన్ సాగర్ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ 12.5 ఎకరాల్లో జలవిహార్ ఉందని వారు పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధి జలవిహార్ నిర్మాణాన్ని వ్యతిరికిస్తూ ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ కోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. అలాగే థ్రిల్ సిటీ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో హైడ్రా హుస్సేన్ సాగర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 2007లో అప్పటి ప్రభుత్వం జలవిహార్ ఏర్పాటు చేసుకునేందుకు 30 ఏళ్ల పాటు భూమిని లీజ్ కు ఇచ్చింది.












Click it and Unblock the Notifications