రుజువు చేస్తే కాలేజీ సర్కార్‌కు సరెండర్ చేస్తా.. రేవంత్ ఆరోపణలపై మంత్రి పువ్వాడ రియాక్షన్
పీజీ మెడికల్ సీట్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్సెస్ మంత్రి పువ్వాడ అజయ్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. పీజీ సీట్ల భర్తీపై సవాళ్లు-ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల దందాపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. టీఆర్‌ఎస్ నేతలు, ఇతర ప్రైవేటు వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రేవంత్ లేఖపై పువ్వాడ అజయ్ స్పందించారు. పీజీ మెడికల్ సీట్ల దందా అని తనపై గవర్నర్‌కు రేవంత్ చేసిన తప్పుడు ఫిర్యాదును ఖండిస్తున్నాని పేర్కొన్నారు. ఆరోపణలు నిరూపిస్తే తన కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు.

తన కాలేజీ ప్రతిష్టను భంగపరిచినందుకు చట్టపరమైన చర్యలు తప్పవని పువ్వాడ అజయ్ హెచ్చరించారు. మమత మెడికల్ కాలేజీలో పారదర్శకంగా పీజీ అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కు చెందిన మెడికల్ కాలేజీల్లో మెడికల్ కౌన్సిల్‌తో విచారణ జరిపించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అవకతవకలు జరగలేదని నిరూపితమైతే... తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం చెప్పినా ఒప్పుకుంటానని రేవంత్‌రెడ్డి అన్నారు.
దీంతో పువ్వాడ అజయ్ స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అజయ్ వేధింపుల వల్లే ఘటన జరిగిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఈ క్రమంలోనే రెవంత్ రెడ్డి అజయ్ కాలేజీకి సంబంధించి అవక తవకల గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications