Hyderabad: కారు కొన్నది 2023లో.. ట్రాఫిక్ చలాన్ మాత్రం 2020లో విధించారు..!

ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లు ఎందుకు విధిస్తారు. మనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ వేస్తారు. హెల్మెట్ లేకున్నా.. రాంగ్ రూట్ లో వెళ్లినా.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, రాంగ్ పార్కింగ్ చేసినా, ట్రిఫుల్ డ్రైవింగ్ చేసినా.. నంబర్ ప్లేట్ సరిగా లేకపోయినా ఫైన్ విధిస్తారు. అయితే కారు 2024 కొట్టే.. ఫైన్ 2020లో విధిస్తారా.. అంటే.. అవును 2024లో కొన్న కారుకు 2020 ఫైన్ వేసినట్లు ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఓ వ్యక్తి.. 2023లో తన స్నేహితుడు కారు కొనుగోలు చేశాడని చెప్పాడు. అయితే ఆ కారుపై ట్రాఫిక్ చలాన్ ఉన్నట్లు గుర్తించినట్లు వివరించాడు. అయితే ఆ ట్రాఫిక్ చలాన్ 2020లో విధించిందిగా పేర్కొన్నాడు. చలాన్ కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. నంబర్ ప్లేట్ సరిగా లేదని రూ.200 ఫైన్ విధించినట్లుగా చలాన్ లో ఉంది. TS15P4459 నంబర్ గల కారుకు ఈ చలాన్ విధించారు. 'నైట్ ఔల్' అనే X వినియోగదారు దీనిని "టైమ్ ట్రావెలింగ్ ట్రాఫిక్ టికెట్" అని పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం అందించాలని నగర ట్రాఫిక్ పోలీసులను కోరారు.

If the car is bought in 2023, the traffic challan will be imposed in 2020

"టైమ్ ట్రావెలింగ్ ట్రాఫిక్ టికెట్? 2024లో కొనుగోలు చేసిన కొత్త కారు కోసం చలాన్ 2020 ఉల్లంఘనతో యజమానిని మిస్టీఫై చేసింది.నా స్నేహితుడు తన టాటా నెక్సాన్ కారును డిసెంబర్ 22, 2023న కొనుగోలు చేశాడు. దానిని జనవరి 6, 2024న రిజిస్టర్ చేసుకున్నాడు. కారుకు ట్రాఫిక్ చలాన్ ఉందా అని తనిఖీ చేశాం. నంబర్ ప్లేట్ సక్రమంగా లేకపోవడాన్ని ఫైన్ విధించినట్లు ఉంది. అయితే అది డిసెంబర్ 14, 2020 ఫైన్ విధించినట్లు చలాన్ లో ఉంది. అయితే ఆ సమయంలో ఆయనకు కారు లేదు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులుదయచేసి ఒక పరిష్కారం అందించండి" అంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. అయితే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. కారు నంబర్ సరిగా ఎంటర్ చేయకపోవడం వల్ల.. లేదా కొందరు దొంగ నంబర్ ప్లేట్ పెట్టుకుని తిరుగుతుంటారు. దీని వల్ల తప్పిదాలు జరుగుతుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+