స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్‌లో ఐజీ..
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ప్రంట్ లైన్ వారియర్స్ పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది. తెలంగాణలో 5 వేల మంది పోలీసులు వైరస్ బారినపడ్డారు. తర్వాత వారు కోలుకొని విధుల్లో చేరారు. అయితే తాజాగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర కూడా కరోనా వైరస్ పాజిటి వచ్చింది. దీంతో కాస్త ఆందోళన నెలకొంది. గత వారం రోజుల నుంచి రవీంద్రను కలిసిన అధికారులు.. కరోనా టెస్ట్ చేయించుకుంటామని చెబుతున్నారు.

వైద్యుల సూచన మేరకు స్టీఫెన్ రవీంద్ర హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా మరునాడు పాజిటివ్ అని తేలింది. గత వారం రోజులుగా రవీంద్రను కలిసిన అధికారులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు.
రవీంద్రను ఏపీ ఐబీ చీఫ్‌గా తీసుకోవాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీనిపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. ఇంటర్ స్టేట్ బదిలీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఆయన బదిలీ మాత్రం జరగడం లేదు. స్టీఫెన్ రవీంద్ర గతంలో వైఎస్ఆర్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications