హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో అర్ధాంతరంగా నిలిచిన ఇండియా కార్ రేసింగ్ లీగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసింది. శనివారం టెస్ట్ రేస్‌లు.. ఆదివారం సమయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయారు. పలు ప్రమాదాలు ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది.

ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జేకే టైర్స్ ఆధ్వర్యంలో ఫార్మ్ లా-4 రేస్ మత్రమే నిర్వహించారు. సాయంత్రం చీకటి పడటంతో ఎలాంటి రేస్‌లు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ నిర్వహణకు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటం, క్వాలిఫయింగ్ రౌండ్ లో ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

India car racing league cancelled in hyderabad.

ఈ క్రమంలో ఇండియా రేసింగ్ లీగ్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. రేసింగ్‌లో ఆదివారం ఉదయం నుంచి ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక మహిళా రేసర్‌కు స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మిగితా నాలుగు ప్రమాదాల్లో కూడా రేసర్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా జరగనుంది. కాగా, నిన్న, ఈరోజు జరిగిన కారు రేసింగ్ ను చూసేందుకు సందర్శకులు భారీగానే తరలివచ్చారు. ఈ రేస్ మధ్యలోనే రద్దు కావడంతో రేసింగ్ ప్రియులు కాస్త నిరాశకు గురయ్యారు.

English summary
India car racing league cancelled in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X