దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద నిర్మించిన మేథా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద ప్రైవేటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనుంది.
Hon'ble CM Sri K. Chandrashekar Rao today inaugurated the Railway Bogies and Coaches manufacturing facility of Medha Servo Drive Pvt. Ltd. at Kondakal in Rangareddy District. Later, the CM addressed the gathering.
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2023
Ministers Sri @KTRBRS, Sri @BRSHarish, Smt. @SabithaindraTRS, Sri… pic.twitter.com/mZ4P3aVn3y
రైల్ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనుంది. కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం సీఎ కేసీఆర్ కర్మాగారంలో మిషన్లను పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు వాటి పనితీరును సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేయనున్నారని.. మేథా పరిశ్రమను చూసి గర్వపడుతున్నానని అన్నారు. వరంగల్ ముద్దు బిడ్డలు కశ్యప్, శ్రీనివాస్ రెడ్డి, మేధా ఫ్యామిలీ వందలమందికి ఉపాధి కల్పిస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. ముంబై నుంచి మోనో రైలు ఆర్డర్ కూడా మేధా సంస్థకు రావడం గొప్ప విషయమన్నారు. ఆ సంస్థకు ప్రభుత్వం తరపున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

మేధాకు అనుబంధంగా విదేశీ పరిశ్రమలు కూడా వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. టీఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దీంతో రూ. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. 15 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే అనుమతులు వచ్చినట్లేనని భావించి పరిశ్రమలను ప్రారంభించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, మేథా ఎండీ కశ్యప్‌రెడ్డి ఉన్నారు.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆస్పత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మానిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , టీఎస్ఎంఐడీ సీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications