హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 5 వరకు రెగ్యూలర్ పరీక్షలు జరగనుండగా.. మే 6, 9 తేదీల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ పరీక్షలు జరగుతాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఏప్రిల్ 12వ తేదీ ఎన్విరాన్మెంటల్ నిర్వహించనున్నారు.సెకండ్ ఇయర్ విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తర్వాతి రోజు నుంచి జరుగుతాయి. పరీక్షా సమయం ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నట్లు ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారు.

inter exams schedule released in the telangana

కరోనా వల్ల పరీక్షలు సజావుగా జరగడం లేదు. వైరస్ తీవ్రత నేపథ్యంలో పాస్ చేయాల్సి వస్తోంది. గతేడాది సీబీఎస్ఈ పరీక్షలను కూడా నిర్వహించలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి సమ్మర్‌లో తీవ్రత ఉండబోదు అని నిపుణులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలీ మరీ.

ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది. ఇప్పుడు క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

English summary
inter exams schedule released in the telangana. exams are started at april 20th and ends may 9th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X