• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sunrsiersకు సపోర్ట్‌గా కేటీఆర్ శాఖ ఇలా -సిటీలో IPL 2020 ఫీవర్ -కేబుల్ బ్రిడ్జిపై నిషేధాజ్ఞలు

|

మొట్టమొదటి సారి ఐపీఎల్ ఫైనల్స్ కు చేరాలని తహతహలాడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగు విజయాలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు ఇంకాసేపట్లో తెరలేవనుంది. IPL 2020 రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో భాగంగా ఆదివారం రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో..

తెలంగాణ సర్కార్ విషెస్..

తెలంగాణ సర్కార్ విషెస్..

ఐపీఎల్ 2020లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వార్నర్ నాయకత్వంలోని హైదరాబాద్ జట్టు ఓడించింది. క్వాలిఫయర్ దశకు చేరడం, ఆదివారం నాటి ఢిల్లీతో మ్యాచ్ గెలవడం ద్వారా ఫైనల్స్ లోకి వెళ్లాలనుకుంటోన్న సన్ రైజర్స్ టీమ్ కు తెలంగాణ ప్రభుత్వం శుభాభినందనలు తెలియజేసింది. అంతేకాదు, ఎస్ఆర్‌హెచ్ కు మద్దతుగా మంత్రి కేటీఆర్ శాఖ అయిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలా..

కేబుల్ వంతెనపై SRH లోగో..

కేబుల్ వంతెనపై SRH లోగో..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముందు సన్‌రైజర్స్‌కు హైదరాబాదీలందరి తరఫున తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఢిల్లీపై సన్‌రైజర్స్ గెలవాలని ఆకాంక్షించారు. శనివారం నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆరెంజ్ కలర్‌లో ఏర్పాటు చేసిన లైటింగ్‌‌ను, సన్‌రైజర్స్ డిజిటల్ లోగోను ఉంచి ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చింది. ఈ ఫొటోలను అరవింద్ కుమార్ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

షాకింగ్:7 కోట్ల ఓట్లతో ట్రంప్ గెలుపు! -తుపాకులు, స్ప్రే,బ్యాట్లతో దాడులు-అమెరికాలో తీవ్రమైన అల్లర్లు

ఐపీఎల్ ఫీవర్.. ఆ రికార్డు దాటుతుందా?

ఐపీఎల్ ఫీవర్.. ఆ రికార్డు దాటుతుందా?

డీసీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేపథ్యంలో దేశమంతటా ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. హైదరాబాద్ లోనైతే ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో వీక్షణ కోసం ఆయా ప్రాంతాలు, కమ్యూనిటీల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. చాలా మంది తమ షెడ్యూల్ ను మ్యాచ్ కోసమే కేటాయించారు. ఐపీఎల్ 2020 సీజన్ తొలి మ్యాచ్ లో రికార్డు స్థాయి టీఆర్‌పీ నమోదుకాగా, ఆ నంబర్ దాటుతుందేమో అనేంత స్థాయిలో ఆదివారం నాటి ఢిల్వీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ కు జనం ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే..

కేబుల్ బ్రిడ్జిపై నిషేధాజ్ఞలు..

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ జట్టుకు మద్దతుగా మున్సిపల్ శాఖ దుర్గం చెరువు కేబుల్ వంతెనపై లైటింగ్ ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వస్తున్న సందర్శకులు ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతుండటంతో వారాంతాల్లో బ్రిడ్జిపైకి వాహనాల అనుమతిని నిషేధించారు. కేబుల్ బ్రిడ్జి పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షల మేరకు శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు ఎలాంటి వాహనాలను కేబుల్ బ్రిడ్జిపైకి అనుమతించబోరు.

English summary
extending best wishes to sunrisers hyderabad team for ipl 2020 Qualifier 2, the telangana municipal administration department made an intresting action. The lighting and digitalis at hyderabad's Durgam Cheruvu Cable Bridge is done up since yesterday conveying our whole hearted support. minister ktr retweets pic, posted by ias arvind kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X