కేసీఆర్‌ను కలిసిన జగన్, ఆసక్తికర సన్నివేశాలెన్నో (వీడియో)

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీకి కాబోయే సీఎం జగన్ కలిసిన సందర్భాల్లో ఆసక్తికర సన్నివేశాలెన్నో జరిగాయి. ప్రగతిభవన్‌కు జగన్ దంపతులు రాగానే స్వయంగా కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఆత్మీయ ఆలింగనం చేసుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇంతలో కేటీఆర్ వచ్చి జగన్ దంపతులను విష్ చేశారు.

jagan met kcr

ఈ నెల 30వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించడానికి వచ్చారు. ప్రగతిభవన్ లోపల సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ .. భారతిని ఆహ్వానించారు. తర్వాత శైలిమ, భారతి పరస్పరం పసుపు కుంకుమ పెట్టుకున్నారు. తమ మంత్రులను జగన్ కు పరిచయం చేశారు కేసీఆర్. జగన్ వైసీపీ నేతలను పరిచయం చేశారు. త్వరాత జగన్ కు కేసీఆర్ పుష్పగుచ్చం అందజేశారు. శాలువాకప్పి, మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు కేసీఆర్. తర్వాత వీణను కూడా బహుకరించారు కేసీఆర్. ఈ సందర్భంగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి కేసీఆర్ పాదాభివందనం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళ్లు మొక్కు సమయంలో కేసీఆర్ వారించి పైకి తీసుకున్నారు. ఇటు అవినాష్ రెడ్డి కూడా కేసీఆర్ పాదాభివందనం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+