షాకింగ్ : గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల బంగారం మాయం...

గాంధీ ఆస్పత్రిలో కొంతమంది కరోనా రోగుల బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు తమ ఆభరణాలు మాయమైనట్లు వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సాయంతో చోరీపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పేషెంట్ మరణించాక మృతునిపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించడం లేదంటూ కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బంగారం చోరీపై ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనూ కరనా పేషెంట్ బంగారు గొలుసు మాయమైన ఘటన కలకలం రేపింది.

Jewellery goes missing from COVID-19 victims in gandhi hospital in hyderabad

Recommended Video

    Uttam Kumar Reddy, Bhatti Vikramarka Slams KCR Govt Over Corona Cases Issue

    కాగా,తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 9 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,771కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 895కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,635 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 1,10,241మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.2శాతంగా ఉండగా, మరణాల రేటు 0.62శాతంగా ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+