కేఏ పాల్ మళ్లీ వేశాడు.. కేసీఆర్, రాహుల్ లక్ష్యంగా విమర్శలు, ఓటు బ్యాంకు లేదని

కేఏ పాల్ మళ్లీ వేశాడు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరొసారి ఆయనను టార్గెట్ చేశారు. తాను కూడా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకుంటానని అడిగానని చెప్పారు. కానీ తనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వాపోయాడు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కాదు.. రాహుల్ గాంధీపై కూడా విరుచుకుపడ్డారు. ఆయన పెద్ద ఫిగర్ ఏమీ కాదని చెప్పుకొచ్చారు. మరీ దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా కౌంటర్ వస్తుందో చూడాలీ మరీ.

రాహుల్ గాంధీకి ఓటు బ్యాంకు లేదని పాల్ చెప్పారు. అయినా అతని సభకు పర్మిషన్ ఇచ్చారని పాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాను రైతుల కోసం ఆందోళన బాట పట్టానని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ తనపై కక్షగట్టారని అన్నారు. తనకు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఆగేది లేదని చెప్పారు. రైతులు, నిరుద్యోగుల కోసం పోరుబాట పడతానని చెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. కానీ కేసీఆర్ కన్నా రాహుల్ గాంధీ లక్ష్యంగా కామెంట్లు చేశారు. ఇదీ చర్చానీయాంశం అయ్యింది. రాహుల్ గాంధీ సభ నిర్వహించే రోజున తాను కూడా సభ పెడతానని చెప్పారు.

ka paul made sensational comments on kcr and rahul gandhi

ఈ నెల 6వ తేదీన జరిగే వరంగల్ రైతు సంఘర్షణ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళతారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేస్తారు. రాహుల్‌గాంధీ, ఇతర నేతలకు ఒకటి.. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక నిర్మిస్తారు. వరంగల్ సభలో సాయంత్రం ఏడు గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగాలు ఉంటాయి. చివరగా రాహుల్ గాంధీ మాట్లాడుతారు. సభ తర్వాత వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళతారు. అదు రోజు రాత్రి హైటెక్ సిటిలోని దుర్గం చెరువు పక్కనున్న కోహినూర్ హోటల్‌లో రాహుల్ గాంధీ బస చేస్తారు.

మరుసటి రోజు ఉదయం హోటల్ కోహినూర్‌లో టీపీసీసీ ముఖ్య నాయకులతో అల్పాహార సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి సంజీవయ్య పార్క్ వెళతారు. సంజీవయ్య జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. అటు నుంచి గాంధీ భవన్ వెళతారు. 200 మంది పీసీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల కార్యాచరణపై తెలంగాణ నేతలకు దిశా నిర్గేశం చేస్తారు. రాహుల్ రాక సందర్భంగా గాంధీభవన్ లో డిజిటల్ మెంబర్ షిప్ ఎన్ రోలర్స్‌తో ఫొటో సెషన్ ఏర్పాటు చేస్తారు. తెలంగాణ అమరవీరుల తో రాహుల్ గాంధీ లంచ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+