కేసీఆర్ 1, కేటీఆర్ 10.. బండారం బయటపెడతా: బండి సంజయ్
ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ఏక్ నంబర్, మంత్రి కేటీఆర్ దస్ నంబర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సంజయ్ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
పెద్దపల్లిలో జరిగిన వామన్ రావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేయొద్దని సంజయ్ హితవు పలికారు. త్వరలో కేసీఆర్‌కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తానని సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఎంపీగా కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు.

బీజేపీ హైకమాండ్ అనుమతితో కేసీఆర్ బండారం బయటపెడతానని సంజయ్ అన్నారు. ఇదీ ముమ్మాటికీ పార్లమెంట్‌ను కుదిపేసే అంశమవుతోందని తెలిపారు. రాజకీయ స్వార్థం కోసమే పీవీని కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామంటే కేసీఆర్ కనీసం స్పందించలేదన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసి పొరపాటు చేయొద్దని కోరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications