హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ఎవరికి ఏ శాఖ అంటే: ఆర్థికం సహా కీలక శాఖలు కేసీఆర్ వద్దే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రులకు మంగళవారం శాఖలు కేటాయించారు. రెండు నెలలకు పైగా కేసీఆర్ కేబినెట్ పైన ఉత్కంఠ కొనసాగింది. గతంలో కేసీఆర్, మహమూద్ అలీలకు తోడు తాజాగా, ఈ రోజు మరో పదిమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. భారీ కసరత్తు అనంతరం పది మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. పలువురికి కొత్త వారికి అవకాశమిచ్చారు. మహిళలకు మరోసారి మొండిచేయి చూపారు.

కీలక శాఖలను కేసీఆర్ తన వద్ద అట్టిపెట్టుకున్నారు. గతంలో కేటీఆర్ చూసిన శాఖలను కూడా దాదాపు తన వద్దే పెట్టుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో పాటు ఆర్థిక శాఖను కూడా ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక, రెవెన్యూ, ఐటీ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి శాఖలు చాలా కీలకం. వాటిని కేసీఆర్ ఎవరికీ కేటాయించలేదు. తన వద్దే ఉంచుకున్నారు.

KCR expands Telangana cabinet with ten more ministers, Ministers allotted portpolio

ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్య శాఖ
ప్రశాంత్ రెడ్డి - రవాణా, రోడ్లు భవనాల శాఖ
నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ
జగదీష్ రెడ్డి - విద్యా శాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశుసంవర్ధక శాఖ
కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖలు
ఇంద్రకరణ్ రెడ్డి - న్యాయ, అటవీ, దేవాదాయ శాఖ
మల్లారెడ్డి - కార్మిక శాఖ
ఎర్రబెల్లి దయాకర రావు - పంచాయతీరాజ్ శాఖ
శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్ శాఖ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ

తలసాని శ్రీనివాస్ యాదవ్ నాలుగోసారి మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోను మంత్రిగా చేశారు. ఎర్రబెల్లి దయాకర రావు టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. తెరాసలో చేరాక ఎదురు చూపుల అనంతరం ఆయనకు కేబినెట్లో చోటు దక్కింది. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు.

English summary
Telangana chief Minister KCR allotted portpolios to newly inducted 10 ministers on Tuesday. KCR on tuesday expanded his cabinet by inducting ten more ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X