2024లో ప్రధాని కేసీఆరే, మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఆటలు ఇక సాగవని తెలిపారు. హైదరాబాద్‌లో ఆ పార్టీలను తరిమికొడతామని వివరించారు. తమ పార్టీ ఆదరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు.
దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు లేవని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని వివరించారు. మరే రాష్ట్రం ఇలా విద్య కోసం పథకాలు ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఒక తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థులు తమకు ప్రయారిటీ అని మల్లారెడ్డి తెలిపారు. వారి భవిష్యత్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు కేసీఆర్ వెనకాడటం లేదని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరే రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అంతగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో తమ పార్టీ దేశ వ్యాప్తంగా విజయఢంకా మోగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రకోట మీద ప్రధాని హోదాలో కేసీఆర్ జెండా ఎగరేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని వివరించారు. కాంగ్రెస్ ఎప్పటిలానే ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం అని చెప్పారు.












Click it and Unblock the Notifications