వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన కేసీఆర్.!మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రుల వ్యాఖ్యలు.!
హైదరాబాద్ : తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం పూర్తిగా మారిపోయిందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. సాగు నీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందని సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కాని యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో జరిగే నష్టం రైతుకే కాదు ప్రభుత్వానికి కూడా నష్టమేనన్నారు. ఈ నష్టం నివారించడానికి గత క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుకు నష్టాలు నివారించడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసంఘం నియమించారని తెలిపారు. యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం కోరింది.

వీటిపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.యాసంగి సాగులో యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగుపై , ఇతర అంశాలపై విస్తృత చర్చ జరిపిందవి మంత్రివర్గ ఉపసంఘం. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో మంత్రి వర్గ ఉప సంఘం విస్తృత చర్చ జరిపారు.
తదుపరి సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న మంత్రులు సూచించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాదికారులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications