• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆర్టీసీతో కేసీఆర్ ది అవినాభావ బంధం: డిప్యూటీ స్పీకర్..సీఎం అయ్యేదాక: మరి..ఇప్పుడు..!

|

ఆర్టీసీ బస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసారు. 1996 నుండి 1999 వరకు కేసీఆర్ నిత్యం బస్సులు..కార్మికుల సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఆయన ఫైళ్లు పెండింగ్ లో పెట్టేవారంటూ కేసీఆర్ పైన చంద్రబాబు ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయని నాటి సహచరులు ఇప్పటికీ చెబుతారు. ఇక, అదే కేసీఆర్ కు మంత్రి పదవి కాకుండా..ఆయన వర్గానికే చెందిన విజయ రామారావుకు మంత్రి పదవి దక్కింది. దీంతో..కేసీఆర్ కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే కొనసాగుతూ..కొత్త పార్టీకి రూపకల్పన చేసారు. టీఆర్ యస్ ఏర్పాటు చేసారు. ఇక, 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే దాక ఆయన ఉద్యమ ప్రస్తానం తెలిసిందే. కానీ, కేసీఆర్ హింసకు తావు లేకుండా సారధ్యం వహించిన తెలంగాణ ఉద్యమంలో ప్రతీ సందర్బంలో ఆర్టీసీ బస్ ఆగిన సమయంలోనే తీవ్రత ప్రభుత్వానికి..ఢిల్లీకి తెలిసింది.

ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్‌తో కొట్టారుగా..!

ఇక, వైయస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగస్వామిగా ఉన్న సమయంలో టీఆర్ యస్ నుండి మంత్రులుగా ఎంపిక చేసిన వారికే తిరిగి రవాణా శాఖ దక్కింది. నాటి టీఆర్ యస్ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పని చేసారు. ఇక, 2011లో తెలంగాణ కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఏకంగా 42 రోజుల పాటు సమ్మె సాగింది. ఉద్యోగ..ఉపాధ్యాయ..కార్మిక సంఘాలు చేసిన సమ్మె కంటే అందులో ఆర్టీసీ కార్మికులు చేరిన తరువాత జరిగిన సమ్మె అసలు తీవ్రత దేశానికి తెలిసింది. ఇప్పుడు కేసీఆర్ తరహాలోనే అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ సైతం అనేక ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆర్టీసీ సమ్మ ప్రభావం పడకుండా ప్రయత్నాలు చేసారు. కానీ, సమ్మెతో అసలు లక్ష్యం చేరాల్సిన చోటికి చేరటంతో..42 రోజుల చారిత్రాత్మిక సకల జనుల సమ్మె ముగిసింది. అయితే, అప్పుడు ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ కొందరికి అందలేదని చెబుతున్నారు.

KCR political career almost all link with RTC as minister and also as moment leader

ఇక, ఆర్టీసీ తెలంగాణ ఉద్యోగులతో కలిసి తొలుత తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం ఏర్పాటు చేసింది నాటి ఉద్యమ కారుడు..నేటి మంత్రి హరీష్ ఆయన తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా పని చేసారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు మొండిగా పండుగ రోజుల్లో సమ్మెకు దిగటం..ముఖ్యమంత్రి పైన ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు హద్దు మీరి వ్యాఖ్యలు చేయటం..సవాళ్లు చేయటంతో సీఎం కేసీఆర్ మరింత ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నియంత్రించే స్థాయిలో కార్మిక సంఘాల నేతలు ఉండటాన్ని సహించలేకపోయారు. ఉద్యోగులను తాము తొలిగించలేదని చెబుతున్న కేసీఆర్.. విధుల్లో చేరని

ఉద్యోగులు వారికి వారే సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే..వారిని తొలిగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకుండా.. లేదా ఉద్యోగులు వాతంటగా వారు తొలుగుతున్నట్లుగా పదవి వీరమణ లేఖలు ఇవ్వకుండా వారు ఉద్యోగాల్లోనే ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియనది కాదు.

కానీ, ఆర్టీసీ సమ్మె పేరుతో కార్మిక సంఘాల నేతల ఒత్తిడి లొంగితే భవిష్యత్ లో మరి కొన్ని సంఘాలు ఇదే రకంగా వ్యవహరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ సమ్మె ముందు వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాకు వేతనాల విషయంలో రాజీ పడలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సైతం రంగ ప్రవేశం చేయటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం ఉంది. అయితే, గురువారం హైకోర్టు విచారణ చేయనుంది. కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.

English summary
Telangana Cm KCR has good relation with RTC and Transport in his political life. He worked as Transport minister in united AP. At Telangana moment sakala janula samme RTC played crucial role. Now as CM KCR serious on rtc strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more