హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా సెకండ్ వేవ్: సూపర్ స్పెడర్స్‌పై కన్నేయండి, డీఎంహెచ్‌వోలకు ఆదేశం

|
Google Oneindia TeluguNews

కరోనా.. కరోనా... వైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్లను అధికారులు ఆదేశించారు. వైరస్ నియంత్రణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 11 జిలాల్లో వైరస్ కేసులు త్వరగా పెరుగుతున్నాయని గుర్తించారు. గత 7 రోజుల్లో కేసులు పెరిగాయని చెప్పారు. అయితే పరీక్షలు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

 తక్కువగా టెస్టులు

తక్కువగా టెస్టులు

ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఆశించిన మేర వైరస్ పరీక్షలు జరగడం లేదు. దీంతో పరీక్షలపై డీఎంహెచ్‌వో దృష్టిసారించాలని ఆదేశించారు. పరీక్షలను మరింత పెంచాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ పరీక్షలు జరిగేలా చూడాలని మార్గదర్శకాలు జారీచేశారు. ఒకవేళ రద్దీ ఉంటే ఆ ప్రాంతానికి మొబైల్ టెస్టింగ్ వ్యాన్ పంపించి మరీ పరీక్షలు చేయాలని కోరారు. దీంతో ఫలితం రావడం ద్వారా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

జిల్లాలకు మొబైల్ టెస్టింగ్ యూనిట్

జిల్లాలకు మొబైల్ టెస్టింగ్ యూనిట్

జిల్లాల్లో తక్కువ కరోనా వైరస్ పరీక్షలు జరిగితే అక్కడికి కూడా మొబైల్ టెస్టింగ్ యూనిట్ పంపించాలని స్పష్టంచేశారు. అవసరం అనుకుంటే అన్నీ జిల్లాలకు మొబైల్ టెస్టింగ్ యూనిట్లను పంపిస్తామని వివరించారు. ముఖ్యంగా మార్కెట్లు, రైతు బజార్ తదితర ప్రాంతాలకు పంపిస్తామని పేర్కొన్నారు. అయితే షాపులో పనిచేసే వారికి వైరస్ సోకితే.. వేగంగా వ్యాపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు తెలిపారు.

టెస్ట్ చేస్తే చాలు..

టెస్ట్ చేస్తే చాలు..

ఎవరినైనా కనిపెడితే చాలు త్వరగా పరీక్ష చేసి.. ఐసోలేషన్‌లో ఉంచుతామని తెలిపారు. దీనికి సూపర్ స్పెడర్స్ కనిపెట్టడమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. దీంతోపాటు వైరస్ గురించి అవగాహన కూడా చాలా ముఖ్యం అని తెలిపారు. కానీ చాలా జిల్లాల్లో వైరస్ కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. కానీ సెకండ్ వేవ్ వల్ల పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి తక్కువ అవగాహన ఉంటుందని తెలిపారు. దీనికి పరీక్షలు పెంచడం ఒకటే మార్గం అని పేర్కొన్నారు.

English summary
telangana state health authorities have directed district medical health officers to look out for possible super spreaders of the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X